ETV Bharat / state

'రెండు పడక గదుల నిర్మాణంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది'

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ...  హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద తెలుగుదేశం పార్టీ మహాధర్నా నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున తెదేపా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రభుత్వం రెండు పడక గదుల నిర్మాణంలో వైఫల్యం చెందిందని... అక్కడక్కడ నిర్మించినా... కూలిపోతున్న దుస్థితి ఉందని నేతలు మండిపడ్డారు. ఇప్పటి వరకు వీటికోసం వెచ్చించిన నిధులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Aug 27, 2019, 5:02 AM IST

Updated : Aug 27, 2019, 8:20 AM IST

తెదేపా నేతలు
'రెండు పడక గదుల నిర్మాణంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది'

హైదరాబాద్​లోని ఇందిరాపార్కు వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు మహా ధర్నా నిర్వహించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిర్వహించిన ఈ ఆందోళనకు తెతెదేపా శ్రేణులు తరలివచ్చారు. పేదలు ఇళ్లు వస్తాయని ఎన్నో అశాలు పెట్టుకున్నారని.. తెరాస ప్రభుత్వం వారిని మోసం చేసిందని తెదేపా నేతలు విమర్శించారు.

రాష్ట్రం అప్పుల పాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ పేదలను ఇళ్ల పేరుతో మోసం చేస్తున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ మండిపడ్డారు. తెదేపా పేదల పక్షాన ఉన్న పార్టీ అని... వారికి ఇచ్చిన హామీలు తెరాస పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రం అప్పుల పాలవుతున్నా పేదలకు ఇళ్లు మాత్రం నిర్మించలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను తెదేపా ఆదుకుందని.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తుందన్నారు.

అర్హులైన వారందరికి

రెండు పడక గదులను కేసీఆర్ కలలో మాత్రమే నిర్మిస్తున్నారని పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మొత్తం 22 లక్షల మంది ఇళ్లు లేని కుటుంబాలు ఉన్నా.. ఇప్పటికి వందల సంఖ్యలో కూడా లబ్ధిదారులకు అందించలేదని మండిపడ్డారు. గ్రామ పంచాయతీకి ఒక ఇళ్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా డబుల్​బెడ్​ రూం ఇళ్లు అర్హులైన వారందరికి ఇవ్వాలని... లేని పక్షంలో తెదేపా పోరాటం చేస్తుందని నేతలు హెచ్చరించారు.

ఇదీ చూడండి: విద్యుత్​ ఒప్పందాలపై సీబీఐ విచారణకు సిద్ధంకండి: లక్ష్మణ్

sample description
Last Updated : Aug 27, 2019, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.