తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన ముగింపు నివేదికను సవాలు చేస్తూ.. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్క్ంలు, పలువురు ఏపీ ఉద్యోగులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం వేరే కేసులో సుదీర్ఘ విచారణ కొనసాగించడంతో ఈ విభజన కేసు వాయిదా పడింది.
రాష్ట్రం విడిపోయినప్పటికీ విద్యుత్ ఉద్యోగుల విభజన జరగకపోవడం వల్ల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సమస్య పరిష్కారం కోసం నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ సుమారు ఐదేళ్లుగా పలు దఫాలుగా విచారిస్తూ వస్తోంది.
ఇదీ చూడండి: 'జస్టిస్ ధర్మాధికారి నివేదికను పక్కనపెట్టాలని విజ్ఞప్తి'