ETV Bharat / state

Road accident cases: రోడ్డు ప్రమాదాల్లో నిండు ప్రాణాలు బలి.. మరి నిందితుల మాటేమిటి.? - Justice delay in road accident cases

Road accident cases: పొద్దున లేచి వార్తా పత్రిక తిరగేస్తే చాలు.. ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాల వార్తలు చూస్తూనే ఉంటాం. ఇంత మంది చనిపోయారు.. పలువురికి గాయాలయ్యాయనే విషయాలు.. మనల్ని ఆ సమయంలో కాస్త ఆవేదనకు గురిచేస్తాయి. కాసేపు వాటి గురించి ఆలోచించి తర్వాత మరిచిపోతాం. కానీ ఆ ఘటన మిగిల్చిన గాయం మాత్రం బాధితుల కుటుంబాల్లో ఎన్నటికీ తగ్గదు. చేయని తప్పునకు.. ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఆత్మీయులను కోల్పోవడం తీరని శోకాన్ని మిగులుస్తుంది. కానీ ఆ ఘటనకు కారకులైన వారు మాత్రం.. ఏదో కొన్ని నెలల పాటు జైల్లో ఉండొచ్చి తర్వాత సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఫలితంగా బాధిత కుటుంబాలకు ఏం న్యాయం జరిగిందనే విషయంపై మాత్రం సమాధానం కరవు.

Road accident cases
రోడ్డు ప్రమాదాల కేసులు
author img

By

Published : Dec 7, 2021, 8:56 AM IST

Road accident cases: మద్యం మత్తులో ప్రమాదాలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న నిందితులకు చట్టపరంగా శిక్షలు పడడం లేదు. గర్భశోకంతో బాధితుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నా, కుటుంబ సభ్యులను కోల్పోయి కట్టుబట్టలతో మిగులుతున్నా.. వారికి న్యాయం జరగడం లేదు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి జైళ్లకు పంపుతున్నారు. వారు కొద్దిరోజులు జైల్లో ఉండి బెయిల్‌ తీసుకుని బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారు. నగరంలో గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1400 మంది మృతి చెందారు. సుమారు 800మంది మందుబాబులు ఢీకొట్టడం వల్లే చనిపోయారు.

వైరస్‌ వల్ల జాప్యమట..

Ramya died in road accident news: డీడీ కాలనీలో తల్లిదండ్రులతో నివాసముంటున్న తొమ్మిదేళ్ల బాలిక రమ్య రోడ్డు ప్రమాదంలో జులై 1, 2016న మృతి చెందింది. రమ్య సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో చదువుకుంటోంది. ఆమెను ఇంటికి తీసుకువచ్చేందుకు కారులో ఆమె బాబాయిలు, తాత వెళ్లారు. ఇంటికి వస్తున్నప్పుడు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2/3 నుంచి పంజాగుట్టవైపు వేగంగా వస్తున్న కారు విభాగినిని ఢీకొని రమ్య ప్రయాణిస్తున్న కారుపై పడింది. దీంతో కారులో ఉన్న ఒక బాబాయి అక్కడికక్కడే చనిపోగా.. వారం రోజులు కోమాలో ఉన్న రమ్య తర్వాత చనిపోయింది. ప్రమాదం జరిగిన 18రోజులకు రమ్య తాత చనిపోయాడు. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందగా ఈ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. ప్రధాన నిందితుడు శ్రావిల్‌కు బెయిల్‌ వచ్చింది. కేసు విచారణ ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని బంజారాహిల్స్‌ పోలీసులను ప్రశ్నించగా కరోనా వైరస్‌ ప్రభావంతో కొన్ని నెలలు జాప్యం జరిగిందని. వచ్చేనెలలో విచారణ ప్రారంభమవుతుందని వివరించారు.

అభియోగాలే ఆటంకాలా?.

Justice delay in road accident cases: మద్యం మత్తులో ప్రమాదాలు చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బాధితులు చనిపోతే ఐపీసీ 304 పార్ట్‌-2, ఐపీసీ 337, 185 సెక్షన్లను నమోదు చేస్తున్నారు. కారు పైనుంచి పోనిచ్చినా, ఢీకొట్టినా, బైక్‌తో బలంగా ఢీకొట్టిప్పుడు బాధితులు చనిపోతే అది మద్యంమత్తులో వాహనదారులు చేసిన హత్యేనని బాధితులు అంటున్నారు. కోర్టులో సాక్ష్యాధారాలను సమర్పించేందుకు, ఫోరెన్సిక్‌ విభాగం నుంచి ఫలితాలు వచ్చేందుకు ఆలస్యమవుతుందని పోలీసులు చెబుతున్నారు. మత్తులో నడిపి ప్రాణాలు తీస్తున్న వారిని శిక్షించాలంటే ఐపీసీ సెక్షన్లను మార్చాలంటూ బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

ఇంకెంత కాలం

మద్యం మత్తులో నా కుమార్తె మరణానికి కారణమైన వ్యక్తికి శిక్ష ఎప్పుడు వేస్తారు? ముగ్గురి మరణానికి కారణమైన పబ్‌ను ఏడాది తిరిగేసరికి ఎక్సైజ్‌శాఖ ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చింది. ఇప్పటికీ నా భార్య, తమ్ముడు అనారోగ్య సమస్యలతోనే బాధపడుతున్నారు. ఎన్నో కేసుల్ని పరిష్కరిస్తామంటున్న పోలీసులు రమ్య కేసును ఎందుకు పట్టించుకోవడం లేదు. -పి.వెంకటరమణ, రమ్య తండ్రి

ఇదీ చదవండి: Banjara Hills Accident Today : బంజారాహిల్స్​లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.