ETV Bharat / state

Shaikpet Flyover: ట్రాఫిక్​ ఇక్కట్లకు చెక్​..​ నేడే షేక్​పేట్​ ఫ్లై ఓవర్​ ప్రారంభోత్సవం

Shaikpet Flyover Opening: నూతన సంవత్సరం కానుకగా భాగ్యనగర వాసులకు షేక్‌పేట్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం కింద రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 2.8 కిలోమీటర్ల ఈ పై వంతెనను.. మంత్రి కేటీఆర్‌ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులతో ఆరు లైన్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చినట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి.

author img

By

Published : Dec 31, 2021, 9:48 PM IST

Updated : Jan 1, 2022, 3:12 AM IST

Shaikpet Flyover Opening
షేక్​పేట్​ ఫ్లై ఓవర్

Shaikpet Flyover Opening: హైదరాబాద్​ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన నేపథ్యంలో.. నగరాన్ని 'సిగ్నల్ ఫ్రీ సిటీ'గా తీర్చిదద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం- ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన మరో ప్రాజెక్టు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నది. ఈ పథకం కింద రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 2.8 కిలోమీటర్ల పై వంతెన నిర్మాణం పూర్తయింది. ఎస్​ఆర్​డీపీ ఆధ్వర్యంలో నగరంలో అతిపెద్ద షేక్‌పేట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని నూతన సంవత్సర కానుకగా ఇవాళ (జనవరి 1న).. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.

ట్రాఫిక్​ పరిష్కారానికి 8వేల కోట్లు

KTR inaugurates Shaikpet flyover: ఆరాంఘర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే రహదారిలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం(మిధాని- ఓవైసీ ఆస్పత్రి) మల్టీలెవల్ ఫ్లై ఓవర్ జంక్షన్‌ను మంత్రి కేటీఆర్‌ ఇటీవల ప్రారంభించిన విషయం విదితమే. ఈ పథకం ద్వారా మొత్తం రూ. 8 వేల కోట్ల అంచనా వ్యయంతో 48 వివిధ రకాల అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. అందులో సుమారు 2 వేల కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు తదితర 24 పనులు పూర్తయ్యాయి. మరో 24 పనులు వివిధ ప్రగతి దశల్లో ఉన్నాయి. రోడ్లు, భవనాలు శాఖ, జాతీయ రహదారుల శాఖలతో సమన్వయం చేస్తూ జీహెచ్‌ఎంసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో షేక్‌పేట్ ఫ్లైఓవర్ 2.8 కిలోమీటర్ల కొలువుదీరింది. నగరంలో ఎస్‌ఆర్‌డీపీ ద్వారా చేపట్టిన పై వంతెనల్లో షేక్‌పేట్ ఫ్లై ఓవర్ అత్యంత పొడవైంది.

6 లైన్లతో

ఖైరతాబాద్ జోన్ సర్కిల్ 18 నుంచి శేరిలింగంపల్లి జోన్ మల్కమ్ చెరువు వరకు 6 లైన్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. గతంలో 4 జంక్షన్లు ఓయూ కాలనీ, ఫిల్మ్ నగర్, 7 టూంబ్స్​, విస్పెర్ వ్యాలీ జంక్షన్లలో మేజర్ కారిడార్ గుండా ప్రతి రోజూ 4 లక్షల వాహనాల రాకపోకలు సాగుతాయి. లక్డీకాపూల్ నుంచి మెహిదీపట్నం, టోలిచౌకి మీదుగా గచ్చిబౌలి వరకు 11 కిలోమీటర్ల మేజర్ ట్రాఫిక్ కారిడార్‌లో మెరుగైన రవాణా సౌకర్యంతోపాటు రేతిబౌలి నుంచి బాహ్య వలయ రహదారి గచ్చిబౌలి వరకు ఫ్లైఓవర్ కలుపుతుంది. అంతేకాకుండా ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి జేఎన్‌టీయూ జంక్షన్ వరకు కలుపుతూ 17 కిలోమీటర్ల మేర ఏ ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తుందని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: IT Hub in Nalgonda: మళ్లీ మేమే వస్తాం.. ఐటీ హబ్​ను ప్రారంభిస్తాం: కేటీఆర్​

Last Updated : Jan 1, 2022, 3:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.