ETV Bharat / state

KTR at German Investors Summit: 'పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు' - జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో కేటీఆర్​

KTR at German Investors Summit: పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్​ అన్నారు. జర్మనీ పెట్టుబడిదారులకు రాష్ట్రం ఆహ్వానం పలుకుతోందన్న మంత్రి.. సింగిల్​ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. హైదరాబాద్​లో జరిగిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరైన కేటీఆర్​.. ఈ ఏడున్నరేళ్లలో రాష్ట్రం ఎన్నో సమస్యలు పరిష్కరించిందని పేర్కొన్నారు.

KTR at German Investors Summit
జర్మనీ పెట్టుబడుదారుల సదస్సు
author img

By

Published : Dec 6, 2021, 1:54 PM IST

Updated : Dec 6, 2021, 4:49 PM IST

KTR at German Investors Summit : రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు 2 లక్షల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని.. వాటి ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. హైదరాబాద్‌లో జర్మనీ పెట్టుబడిదారుల సదస్సుకు.. భారత్​లో జర్మనీ రాయబారి వాల్టర్​ జె.లిండ్​నర్​తో కలిసి కేటీఆర్​ హాజరయ్యారు. ఏడున్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలనలో అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించామన్న కేటీఆర్​.. మొదట విద్యుత్ సమస్యను పరిష్కరించామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్​ సరఫరా చేస్తున్నామని తెలిపారు.

Minister KTR Latest News : "పరిశ్రమల ఏర్పాటుకు 2 లక్షల ఎకరాలు అందుబాటులో ఉంది. కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తాం. పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తాం. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయి."

-కేటీఆర్​, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

పెట్టుబడులకు ఆహ్వానం

German Investors Summit : పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో.. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని కేటీఆర్​ తెలిపారు. జర్మనీ పెట్టుబడిదారులకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందన్న మంత్రి.. రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు.

పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు: కేటీఆర్

లైట్​ ఆటో రూ.1500 కోట్ల పెట్టుబడి..

ఈ సందర్భంగా.. జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ లైట్​ఆటో.. రాష్ట్రంలో రూ.1500 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జహీరాబాద్​లో నెలకొల్పనున్న ఈ పరిశ్రమ.. ఆటోమొబైల్​ కంపెనీలకు కీలక ముడిపదార్థాలను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో లైట్​ ఆటో ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా ప్రత్యక్షంగా 9 వేల మందికి, పరోక్షంగా 18 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తామని లైట్​ ఆటో కంపెనీ ఎండీ బాలా ఆనంద్​ వెల్లడించారు.

ఇదీ చదవండి: Medak collector Press meet: 'అసైన్డ్ భూములను జమునా హేచరీస్ కబ్జా చేసింది నిజమే'

Last Updated : Dec 6, 2021, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.