Kodandaram on TRS: రాష్ట్రంలో భూసేకరణపై ప్రభుత్వం అత్యంత దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. నిజాం కాలంనాటి రోజులను గుర్తుచేసేలా భూములు సేకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో భూ నిర్వాసితుల దీక్షకు కోదండరాం మద్దతు తెలిపారు. సర్కారు బలవంతపు భూసేకరణ ఆపాలని కోదండరాం డిమాండ్ చేశారు.
'ప్రభుత్వమే భూ కబ్జాదారు'
'అసైన్డ్ భూముల విషయంలో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడి.. అక్రమంగా లాక్కుంటున్నారు. చిన్న చిన్న లీగల్ సమస్యలను అడ్డం పెట్టుకుని.. అంతో ఇంతో ఇచ్చి భూమిని గుంజుకుంటున్నారు. ప్రభుత్వమే భూ కబ్జాదారుగా అవతారమెత్తింది.
-కోదండ రాం, తెజస అధ్యక్షుడు
ఆ హక్కు ఉండాలి
ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడం చాలా అవసరమని కోదండరాం అభిప్రాయపడ్డారు. రైతులకు భూయాజమాన్య హక్కు ఉండాలని చెప్పారు. ప్రజావసరాల కోసం యజామానుల నుంచి భూములు తీసుకుంటే.. 2013 చట్టం ప్రకారం భూనిర్వాసితులకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: KTR Pressmeet: 'కేంద్రానికి ఇక విజ్ఞప్తులు చేయం.. ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాం'