CPI Chada on RTC bus charges: టీఎస్ ఆర్టీసీ బస్సు ఛార్జీలు కిలోమీటర్‌కు 25 నుంచి 30 పైసలు పెంచాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఛార్జీల పెంపుతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాన్యుడుకి అందుబాటులో ఉండే బస్సు ఛార్జీలు పెంచితే.. పేద ప్రజలపై భారం మోపినట్లు అవుతుందని చాడ అభిప్రాయపడ్డారు. మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
RTC BUS CHARGES: బస్సు ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ యాజమాన్యం కసరత్తులు
ఆర్టీసీని లాభాల్లో నడపడానికి అనేక మార్గాలున్నాయని చాడ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి సరఫరా చేస్తున్న డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని.. డిమాండ్‌కు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచితే ఆర్టీసీ లాభాల బాటలో పడుతుందని సూచించారు.
అందుకే పెంపు ప్రతిపాదనలు
Bus charges hike: కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసిందని.. దాని ప్రభావం ఆర్టీసీ సంస్థపై పడిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆర్టీసీపై అధిక భారం పడిందన్నారు. ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచాల్సిందే అని అన్నారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్‌లతో కలిసి మంత్రి పువ్వాడ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఛార్జీల పెంపు అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.
కొత్తవి కొనుగోలు చేయాలి
దూర ప్రాంతాలకు బస్సులు నడపాలనుకున్నప్పుడు సరైన బస్సులు అందుబాటులో లేవని పువ్వాడ అన్నారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో 643 బస్సులు స్క్రాప్ అయిపోయాయన్నారు. మరో 1,400ల బస్సుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కుదామన్న ఎక్కలేని పరిస్థితి ఉందని ఛైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వాటి స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఛార్జీల పెంపు చాలా అవసరం..
TSRTC bus charges hike: కేవలం డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీకీ రూ.468 కోట్ల నష్టం వచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రూ.2,330 కోట్ల నష్టం, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.1,440 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ప్రగతిరథ చక్రాలు మళ్లీ బాటపట్టాలంటే ఛార్జీల పెంపు చాలా అవసరముందన్నారు. గతంలో కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఛార్జీల పెంపు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఛార్జీలు పెంచాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Bus Ticket Fare: ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచాల్సిందే: మంత్రి అజయ్‌కుమార్