ETV Bharat / state

'తెలుగు' ఇళ్లకు శంకుస్థాపన - ఇళ్లు

కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఈనాడు చేపట్టిన గృహ నిర్మాణ క్రతువులో మరో ముందడుగు పడింది. కుటుంబశ్రీ మిషన్‌తో ఒప్పందం కుదిరిన 24 గంటల్లోనే నివాసాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పునాదిరాయి కార్యక్రమంలో ఈనాడు ప్రతినిధులు, మిషన్ సభ్యులు పాల్గొన్నారు.

'తెలుగు' ఇళ్లకు శంకుస్థాపన
author img

By

Published : Mar 2, 2019, 7:47 PM IST

'తెలుగు' ఇళ్లకు శంకుస్థాపన
వరదల ధాటికి అతలాకుతలమైపోయిన కేరళకు తనవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చిన రామోజీ గ్రూప్... అలప్పుజ జిల్లా పరిధిలోని మహమ్మ గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు తలపెట్టిన యజ్ఞంలో మరో అడుగు వేసింది. కేరళ ప్రభుత్వం సూచన మేరకు కుటుంబశ్రీ మిషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతి రోజే నిర్మాణాలకు శంకుస్థాపన చేసింది.

ఇళ్ల నిర్మాణ పనులను 3 దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశలో 40, రెండో దశ కింద 36 ఇళ్లు సిద్ధం చేస్తారు. 400 చదరపు అడుగుల్లో నిర్మించనున్న ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 6 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రయత్నం 116 కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపనుంది.

7.77 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ గృహాల నిర్మాణం... ఆరు నుంచి ఏడు నెలల్లో పూర్తి చేస్తామని ఈనాడు సీనియర్‌ అసోసియేట్‌ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ వెల్లడించారు.భూమి పూజకు మార్గదర్శి గ్రూప్ ప్రెసిడెంట్ రాజాజీతోపాటు కుటుంబ శ్రీ మిషన్ ప్రతినిధులు హాజరయ్యారు.

Chennai, Mar 02, (ANI): Puthiya Tamilagam party joined the AIADMK-BJP-PMK alliance in Tamil Nadu's Chennai on Saturday. This comes ahead of upcoming Lok Sabha elections. According to Puthiya Tamilagam chief Dr Krishnasamy the party had joined the alliance to contest elections and win over 40 seats in Tamil Nadu and Puducherry.
Wants.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.