పర్యావరణ పరిరక్షణ కోసం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ చురుగ్గా పాల్గొంటోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పార్క్‌లో తెలుగు సినీ రచయితలు సాయిమాధవ్ బుర్రా, లక్ష్మిభూపాల్, శ్రీకాంత్, నిర్మాత బీఏ రాజు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములయ్యారు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచాలని ఈ సందర్భంగా వారు పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని కోరారు.
ఇదీ చదవండి:టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య