ETV Bharat / state

'తెలుగు ఉచ్చారణకు, లిపికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది'

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలుగు భాష, లిపి, ఉచ్చారణలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు లిపిలో రాదగిన మార్పులపై రూపొందించిన తెలుగు భారతి పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్​లో జరిగింది.

basheer bhag press club
nandhini sidda reddy, press club
author img

By

Published : Apr 6, 2021, 3:54 PM IST

తెలుగు లిపిపై తెలుగు భారతి రచయితలు చేసిన సూచనలను సాహిత్య అకాడమీ పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు భాష ఉచ్చారణకు, లిపికి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు.

భాషలో ఒత్తుల వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని... పత్రికలు తీసుకొచ్చిన మార్పులను గ్రాంథికవాదులు కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారు. తెలుగు భాష వర్ణమాల నుంచి తొమ్మిది అక్షరాలను తొలగించారని... ప్రస్తుతం ఒకటో తరగతి తెలుగు వాచకంలో 47 అక్షరాలు మాత్రమే పొందుపరిచారని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: ఐఐటీలో బీఎస్సీ చేయాలనుకుంటున్నారా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.