ETV Bharat / state

ముందే వచ్చిన ఉగాది.. సందడిగా తెలుగోత్సవం - TELUGU PRAJALU

ఉగాది వారం ముందే వచ్చేసింది. సంప్రదాయ రుచులు, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం.. అప్పుడే ఎలా అనుకుంటున్నారా.. ఇద్దరు స్నేహితులు.. ఈ వైభవాన్ని మన ముందుకు తీసుకొచ్చారు.

ముందేవచ్చిన ఉగాది.. సందడిగా తెలుగోత్సవం
author img

By

Published : Apr 2, 2019, 7:33 PM IST

ముందేవచ్చిన ఉగాది.. సందడిగా తెలుగోత్సవం
సంప్రదాయ దుస్తులు ధరించిన అచ్చమైన తెలుగు ప్రజలు, నోరూరించే తెలుగు వంటలు, ఉగాది పచ్చడి, చిలక జోస్యం, మన ముందే గాజులు, మట్టి పాత్రల తయారీ,అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన గోరింటాకు, సంగీతం, నృత్యాలు అబ్బో... ఒక్కటేమిటి తెలుగు సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడే కార్యక్రమం. ఏంటిది, ఎక్కడ అనుకుంటున్నారా? ఉగాది పండగను ముందుగానే చేసుకునే తెలుగోత్సవ కార్యక్రమం. ఇదెక్కడో కాదు మన హైదరాబాదులోనేనండి.

తెలుగోత్సవం ఎలా పుట్టింది..?

హైదరాబాద్ పుడ్డీ క్లబ్ సంస్థ అధిపతి సంకల్ప్, స్సైసీ వెన్యూ సంస్థ అధిపతి శ్రీనివాస్ సంపత్​లు స్నేహితులు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడేందుకు ఏదైనా చేయాలనకున్నారు. అందులో భాగంగానే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన గొప్పతనాన్ని అందిరికీ తెలియజెప్పేందుకు తెలుగోత్సవం పేరిట ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తిచేసుకుని మూడో సంవత్సరంలోకి తెలుగోత్సవం అడుగుపెట్టింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో వచ్చిన డబ్బును రైస్ బకెట్ ఛాలెంజ్ నిర్వహించే స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు మంజులతకు అందజేస్తారు. ఆమె ఆ బియ్యాన్ని అనాథలకు చేరుస్తుంది.

ఈ ఏడాది తెలుగోత్సవ కార్యక్రమంలో...

ఈ సంవత్సరం తెలుగోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది హాజరయ్యారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నోరూరించే వెజ్, నాన్​వెజ్ వంటకాలు, స్వీట్లు, తియ్యటి పానీయాలు అందరిని ఆకట్టుకున్నాయి. కేవలం పల్లెల్లో కనిపించే మట్టి పాత్రల తయారీని చూసి పరవశించిపోయారు పిల్లలు. మహిళలకు అత్యంత ఇష్టమైన గోరింటాకుతో చేతులను అలంకరించుకున్నారు. అంతేకాకుండా చిలకజోస్యం చెప్పించుకుంటూ ఆనందపడ్డారు. గాజుల తయారీని చూసి మైమరిచిపోయారు.

తెలుగోత్సవ కార్యక్రమం ఉగాది పర్వదిన విశిష్టతను అందరికీ తెలియజేస్తుంది. ఇలాంటి కార్యక్రమంతో మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్న ఈ ఇద్దరు స్నేహితుల కృషిని అందరూ అభినందిస్తున్నారు.

ఇవీ చదవండి:'నిజామాబాద్ ఎన్నిక వాయిదా వేయాలని విజ్ఞప్తి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.