ETV Bharat / state

Telemedicine: కరోనా సమయంలో మంచి ఫలితాలు - లాక్​డౌన్ నేపథ్యంలో టెలిమెడిసిన్ సేవలు

లాక్​డౌన్​ నేపథ్యంలో రాష్ట్రంలో టెలి మెడిసిన్‌ (Telemedicine) ద్వారా చేసిన సేవలు సత్ఫలితాలిచ్చాయి. ప్రజలకు ఫోన్‌లోనే వైద్య సేవలందించి మంచి ఫలితాలను పొందారు. కొవిడ్​ రోగులకు ఉచితంగా సేవలు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. నగర శివారు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు టెలిమెడిసిన్‌ కరోనా వేళ పెద్ద దిక్కుగా మారింది.

Telemedicine
టెలి మెడిసిన్‌
author img

By

Published : Jul 9, 2021, 9:20 AM IST

టెలిమెడిసిన్‌ (Telemedicine) ప్రాధాన్యం కరోనా కాలంలో తెలిసొచ్చింది. కరోనా లాక్​డౌన్​ (Corona Lockdown) సమయంలో తక్కువ, మధ్యస్థ కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారు ఎంతోమంది ఇంట్లోనే ఉంటూ టెలిమెడిసిన్‌ (Telemedicine) ద్వారా కోలుకున్నారు. రెండో విడతలో రోగుల సంఖ్య భారీగా పెరగడంతో ఆసుపత్రులన్ని కిటకిటలాడాయి. ‘గాంధీ’లో 650 ఐసీయూ పడకలు అందుబాటులోకి తెచ్చారు. మరో వేయి ఆక్సిజన్‌ పడకలు సిద్ధం చేశారు. అవన్నీ రోగులతో నిండిపోవడంతో రోగులకు నిరీక్షణ తప్పలేదు.

ఉచితంగా సేవలందించి..

నగరానికి చెందిన ‘హెల్పింగ్‌ హ్యాండ్‌ (Helping Hand)’ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో టెలిమెడిసిన్‌ (Telemedicine)పై ఆధారపడి దాదాపు 98-99 శాతం మంది కోలుకున్నట్లు తేల్చారు. కరోనా కాలంలో ఈ సంస్థ ఉచితంగా సేవలను అందుబాటులోకి తెచ్చింది. 18 మంది వైద్యులు, కౌన్సిలర్లను ఏర్పాటు చేసింది. ఐవీఆర్‌ సాంకేతికత ద్వారా కొవిడ్‌ సోకిన రోగులకు టెలిమెడిసిన్‌ (Telemedicine) సేవలు అందించారు. దాదాపు 7,078 మందికి మే 15 నుంచి జూన్‌ 31 వరకు ఈ సేవలు అందించారు. వారిలో జ్వరం, దగ్గు, జలుబుతో పాటు వాసన, రుచి కోల్పోయిన వారే ఎక్కువ. 45 ఏళ్లు ఆపైనే దాటిన చాలా తక్కువ మంది మాత్రం శ్వాస సమస్య తలెత్తడంతో దవాఖానాల్లో చేరారు.

టెలిమెడిసిన్ సేవలు

శివారు ప్రాంతాలకు పెద్దదిక్కు

నగర శివారు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు టెలిమెడిసిన్‌ (Telemedicine) కరోనా వేళ (Pandemic Time) పెద్ద దిక్కుగా మారింది. అడ్డగుట్ట, మేడ్చల్‌, చేవెళ్ల, బాలాపూర్‌, మీర్‌పేట్‌, బోలక్‌పూర్‌, మన్సూరాబాద్‌, సరూర్‌నగర్‌, ఉప్పల్‌, నారపల్లి, పీర్జాదిగూడ ఇతర జిల్లాల నుంచి కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది టెలిమెడిసిన్‌ (Telemedicine) సేవల కోసం సంప్రదించారని ఆ సంస్థ అధ్యక్షుడు ముజ్‌తాబ్‌ హసన్‌ అస్కరీ తెలిపారు. అనంతరం రోగుల డేటాను విశ్లేషించామన్నారు.

ఇదీ చూడండి: బాల్యానికి కరోనా గ్రహణం- భవిత ప్రశ్నార్థకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.