కరోనా కట్టడి కోసం బయట తిరుగుతూ.. కనిపించని వ్యాధితో యుద్ధం చేస్తున్న పోలీసుల కోసం టెలీ మెడిసిన టీ-కన్సల్ట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టిటా) వారు రూపొందించిన ఈ అప్లికేషన్‌ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
ఇప్పటికే తెలంగామ రాష్ట్ర పోలీసులకు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని.. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని టిటా ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో యాప్ ద్వారా టెలీ మెడిసిన సౌకర్యం ఉన్నట్లు వెల్లడించారు. పోలీసుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా యాప్ తయారుచేసినందుకు టిటా ప్రెసిడెంట్‌కు సీపీ అభినందించారు.
ఇవీ చూడండి: ఆటోడ్రైవర్ చేసిన పెట్రోల్ దాడిలో.. హెల్త్‌వర్కర్ మృతి