చర్లపల్లిలోని కేంద్ర కారాగారం నుంచి తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నల్లమాసు కృష్ణ విడుదలయ్యారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అరెస్టు చేసిన తర్వాత ఆయన చర్లపల్లి కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం వల్ల ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. తన ఆరోగ్యం బాగలేదని, తనపై బనాయించిన కేసులన్నీ ఎత్తివేయాలని, ఇకపై తాను న్యాయవాద వృత్తిలో కొనసాగనున్నట్టు నల్లమాసు కృష్ణ తెలిపారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ