Telangana youth Tops In Employment Skills : ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న 18-21 ఏళ్ల యువతలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఆ వయసులోని 85.45 శాతం మందికి ఉద్యోగాలు చేయడానికి తగిన అర్హులు. ఇక నగరాల్లో చూస్తే పుణెలో 80.82శాతంతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ 51.50శాతంతో ఏడో స్థానం దక్కించుకుంది. అదే సమయంలో వయసుకు అతీతంగా నైపుణ్యమున్న యువతను పరిగణలోకి తీసుకుంటే హరియాణ 76.47తో తొలిస్థానంలో ఉండగా తెలంగాణ 67.79కో ఆరో స్థానంలో నిలిచింది.
India Skills Report 2023 : అఖిల భారత సాంకేతక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇతర సంస్థలతో కలిసి వీబాక్స్ రూపొందించిన భారతదేశ నైపుణ్య నివేదికను తాజాగా విడుదల చేసింది. యువతలో ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి వీబాక్స్ సంస్థ సర్వేలో భాగంగా గత 11 సంవత్సరాలుగా వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ (వీనెట్)ను (Vnet) కండక్ట్ చేస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 3.88 లక్షల మంది ఈ పరీక్షలో పాల్గొన్నారు. వారిలో దేశవ్యాప్త సగటు (60 శాతం మార్కులు సాధించింది) 51.25 శాతం ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ నైపుణ్యాల్లో రాష్ట్ర యువత ముందుంటున్నారు. విద్యాశాఖ మరింత దృష్టి సారిస్తే మనం ప్రపంచానికే అత్యున్నత సాంకేతిక నిపుణులను అందించే దేశంగా మారుతాం. అందులో పరిశ్రమలతో అనుసంధానం పెంచుకోవడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించడం, ఇంటర్న్‌షిప్‌లను (Internship) కల్పించాలని సన్‌టెక్ కార్ప్ క్యాంపస్ రిక్రూట్మెంట్, ట్రైనింగ్ సంస్థ సీఈఓ వెంకట్ కాంచనపల్లి అభిప్రాయపడ్డారు.
భారత్‌లో ఐఫోన్ల తయారీ మూడింతలు.. 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు!
- అత్యధిక న్యూమరికల్ స్కిల్స్ ఉన్న యువత తెలంగాణలోనే ఉంది. ఇక్కడ 78.68 శాతం మందిలో ఆ నైపుణ్యాలున్నాయి. ఆ తర్వాత ఏపీ (69.45) శాతంతో ఉంది
- అత్యధిక (44.0)శాతం ఉద్యోగ నైపుణ్యాలున్న అమ్మాయిలతో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది.
- ఉద్యోగం చేసేందుకు యువతీ యువకుల తొలి ప్రాధాన్య రాష్ట్రంగా కేరళ ఉంది. యువతులు ఎక్కువగా కొచ్చి నగరాన్ని ఎంచుకుంటున్నారు.
- ఆంగ్ల భాషా నైపుణ్యాల్లో కర్ణాటక (73.33) శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత యూపీ (66.75) శాతం, కేరణ (61.66)శాతంతో ఉన్నాయి.
18-21 వయసు వారిలో ఉద్యోగ నైపుణ్యాలున్న తొలి 10 రాష్ట్రాలు | |
రాష్ట్రం | నైపుణ్యాలున్న యువత శాతం |
తెలంగాణ | 85.45 |
కేరళ | 74.93 |
మహరాష్ట్ర | 74.80 |
ఏపీ | 73.10 |
యూపీ | 68.15 |
కర్ణాటక | 67.45 |
తమిళనాడు | 65.65 |
బిహార్ | 60.00 |
పంజాబ్ | 58.26 |
హరియాణ | 56.14 |
కోర్సుల వారిగా ప్రతిభ ఇది | |
కోర్సు | 60% మార్కుల పొందిన వారు |
ఎంబీఏ | 71.16 |
బీటెక్ | 64.67 |
ఎంసీఏ | 64.63 |
బీఫార్మసీ | 54.00 |
బీఎస్సీ | 51.27 |
బీకాం | 48.12 |
బీఏ | 47.11 |
ఐటీఐ | 40.00 |
పాలిటెక్నిక్ | 22.37 |
ఇంటర్‌తో ఆర్మీలో ఉద్యోగావకాశాలు.. జీతం రూ.50 వేలకు పైనే..!