Telangana Liquor Shops Tender 2023 : రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల కొత్తలైసెన్స్ల (wine shops Licens) కొరకు లక్కీ డ్రా పక్రియ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, దరఖాస్తుదారుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించిన వారికి మద్యం దుకాణాలు కేటాయించగా.. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల్లో విక్రయాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. వేలం ప్రక్రియలో చాలా చోట్ల మహిళలు పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. లక్కీ డ్రాలో షాపులు పొందిన వారు సంతోషంగా గడపగా.. రాని వారు నిరాశతో వెనుదిరిగారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో (Warangal) 294 దుకాణాలకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 15వేల 926 దరఖాస్తులు వచ్చాయి. పోలీసుల పటిష్ఠ బందోబస్తు నడుమ.. అర్హులకు లక్కీ డ్రా ద్వారా దుకాణాలు కేటాయించారు. ప్రస్తుత వరంగల్ జిల్లాలో 63 దుకాణాలకు 2938 దరఖాస్తులు రాగా నానీ గార్డెన్స్‌లో కలెక్టర్ ప్రావీణ్య లక్కీ డ్రా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో 59 దుకాణాలకు.. 2వేల 571 దరఖాస్తులు రాగా జిల్లా కలెక్టర్ శశాంక డ్రా నిర్వహించారు. జనగామలో 47మద్యం దుకాణాలకు 2491 దరఖాస్తులు వచ్చాయి.
Wine Shops Lucky Draw Final List : ములుగు, భూపాలపల్లికి సంబంధించి 60 దుకాణాలకు 2వేల 68 దరఖాస్తులు రాగా.. జిల్లా కలెక్టర్ల భవేష్ మిశ్రాలు సింగరేణి ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో 93 మద్యం దుకాణాలకు 4వేల166 దరఖాస్తులు రాగా.. స్థానిక విపంచి కళానిలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి.. మొత్తం 122 దుకాణాలకు సంబంధించి 7వేల 29 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా సీపీ విష్ణువారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి తదితరులు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు.
Telangana New Liquor Policy 2023 : ఆదిలాబాద్‌లో (Adilabad) మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమం కలెక్టర్ రాహుల్ రాజ్ సమక్షంలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 40 దుకాణాలకు 979 దరఖాస్తులు రాగా.. 9 దుకాణాలకు దరఖాస్తులు తక్కువ వచ్చాయి. వాటికి వేలం వాయిదా వేశారు. మిగిలని వాటికి ఇవాళ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ యాష్మిన్బాషా సమక్ష్యంలో మద్యం లాటరీ డ్రా నిర్వహిస్తున్నారు. జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా 71 మద్యం దుకాణాలకు 2వేల 636 దరఖాస్తులు వచ్చాయి.
సిండికేట్లకు తావు లేదు: దేశంలో ఎక్కడ లేని విధంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా అందరి సమక్షంలో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించినట్లు అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తెలిపారు. గతంలో మద్యం వ్యాపారస్థులు మాఫీయాగా ఏర్పడి లేబుల్స్ వేసి, నఖిలి మద్యం తయారు చేసి అమ్మేవారని పేరొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తోన్న మద్యాన్ని కట్టడి చేస్తున్నామని తెలిపారు. సిండికేట్లకు తావు లేకుండా రిజర్వేషన్ల ద్వారా అన్ని వర్గాలకు మద్యం దుకాణాలు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.
మద్యం షాపులు మళ్లీ ప్రైవేటుకే.. త్వరలోనే నూతన విధానం..!
ఆదివారం సందడి.. వైన్‌షాపుల ముందు మందుబాబుల క్యూ
మందుబాబుకు దొంగనోటు కట్టబెట్టిన వైన్స్ సిబ్బంది.. నిలదీసే సరికి..!