ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి మహమూద్ అలీ మొక్కలు నాటారు. గోషామహల్ స్టేడియంలో మొక్కలు నాటిన మంత్రి.. కార్యకర్తలంతా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటాలని సూచించారు.
రాష్ట్రంలో అడవులను పెంచాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మహమూద్ అలీ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. రాష్ట్రం అవతరించాక సీఎం కేసీఆర్ పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆయన.. ప్రతి ఒక్కరూ ఆరో విడత హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఇదీచూడండి: కాళేశ్వరం మొత్తం నిర్మాణ వ్యయం రూ. 1,10,000 కోట్లు