ETV Bharat / state

పీఈటీ, పీడీ పోస్టులను భర్తీ చేయాలని మంత్రికి వినతి - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ, ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి రాష్ట్ర అధ్యక్షుడు మాదగోని సైదులు గౌడ్ వినతి పత్రం అందజశారు. ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన్నారు.

telangana-unemployed-private-physical-education-teachers-association-met-minister-sabitha-and-demand-to-fill-vacancies-in-pet-and-pd-in-hyderabad
పీఈటీ, పీడీ పోస్టులను భర్తీ చేయాలి: మాదగోని సైదులు
author img

By

Published : Feb 5, 2021, 12:14 PM IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ, ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాదగోని సైదులు గౌడ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్​బాగ్​లోని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.

ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో పీఈటీ, పీడీ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారని తెలిపారు. విద్యార్థుల్లో ఇమ్యూనిటీ పెంచడానికి క్రీడలు అవసరమవుతాయని పేర్కొన్నారు. నిరుద్యోగులను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ పోస్టులను భర్తీ చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఎవరెన్ని కుట్రలు చేసినా తెరాస గెలుపును ఆపలేరు: పల్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.