ETV Bharat / state

సరళతర వాణిజ్య విధానంలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్ - minister ktr latest updates

విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టే సమయంలో దేశం మొత్తాన్ని యూనిట్​గా కాకుండా... తెలంగాణ లాంటి రాష్ట్రాలను ప్రత్యేకంగా చూడాలని... పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అమెరికాలాంటి అగ్రరాజ్యాలు సైతం కరోనా ఔషధాల కోసం ఇక్కడి కంపెనీలపై ఆధారపడుతున్నాయన్న మంత్రి... ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణలో బలమైన వ్యవస్థ ఉందని చెప్పారు. భారతదేశంలోనే అతిపెద్దదైన వైద్యఉపకరణాల తయారీ పార్క్‌లో పెట్టుబడులకు అద్భుత అవకాశాలు ఉన్నాయని వివరించారు. టీఎస్​ఐపాస్ సహా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను.. అమెరికా కంపెనీల ప్రతినిధులు ప్రశంసించారు.

Telangana tops the line of liberal trading says minister ktr
సరళతర వాణిజ్య విధానంలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్
author img

By

Published : Jul 10, 2020, 4:37 AM IST

సరళతర వాణిజ్య విధానంలో అగ్రస్థానంలో తెలంగాణ

వివిధ అమెరికా కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో యూఎస్ ఐబీసీ సంస్థ నిర్వహించిన వెబినార్‌లో... పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ఫార్మా, టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్... ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ, రిటైల్ వంటి రంగాల నుంచి పదుల సంఖ్యలో పెట్టుబడిదారులు, కంపెనీల అధినేతలు వెబినార్​లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన మంత్రి... పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ కంపెనీలు స్థూలంగా భారతదేశాన్ని ఒక యూనిట్‌గా కాకుండా... తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలను ప్రత్యేక యూనిట్‌గా తీసుకోవాలని కోరారు.

అగ్రస్థానంలో..

స్థూలంగా అన్ని రాష్ట్రాలను కలిపి చూసినప్పుడు ఉండే పెట్టుబడి అవకాశాలకు, పరిస్థితులకు... ప్రత్యేకంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు అవకాశాలకు చాలా తేడా ఉంటుందని కేటీఆర్ అన్నారు. గత ఆరేళ్లుగా దేశంలోని అనేక రాష్ట్రాల కన్నా భిన్నంగా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోందని చెప్పారు. దేశంలోనే అత్యంత తక్కువ వయస్సు కలిగిన రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వ నూతన విధానాలు, నిర్ణయాల పరంగా వినూత్న పంథాలో ముందుకు పోతోందని... సరళతర వాణిజ్య విధానంలో అగ్రస్థానంలో ఉందని మంత్రి వివరించారు.

కరోనా సంక్షోభంలోనూ..

టీఎస్​ఐపాస్‌ విధానం ద్వారా కేవలం పక్షం రోజుల్లోనే.. అన్ని రకాల అనుమతులు ఇస్తున్నామన్న ఆయన.. అనుమతులు పొందిన వాటిలో ఇప్పటి వరకు 80 శాతానికి పైగా కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. టెక్స్ టైల్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి 14 రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలుస్తోందని అన్నారు.

అగ్రరాజ్యం సైతం...

రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగానికి సంబంధించి బలమైన వ్యవస్థ ఉందన్న కేటీఆర్... ప్రస్తుతం అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా ఔషధాలపై ప్రధానంగా ఆధారపడుతున్నాయని ప్రస్తావించారు. అనేక ఐటీ కంపెనీలు అమెరికా తర్వాత అతిపెద్ద ప్రాంగణాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా.. గుర్తు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద వైద్యఉపకరణాల తయారీ పార్క్ తెలంగాణలో ఉందన్న ఆయన... ఈ రంగంలోనూ అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన అమెరికన్ కంపెనీల అధినేతలు... టీఎస్ ఐపాస్ విధానం, పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతును ప్రశంసించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో సంపూర్ణ సహకారం ఉంటుందన్న యూఎస్ ఐబీసీ అధ్యక్షులు నిషా బిస్వాల్... ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంటామని చెప్పారు.

ఇవీ చూడండి: కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.