ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యధిక కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 48.39 శాతం వ్యాక్సినేషన్‌తో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 250 ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సినేషన్ జరుగుతోంది. నిన్న రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో 11 లక్షల 85 వేల 77 వ్యాక్సిన్లు ఇచ్చారు. వాటిలో 9 లక్షల 51 వేల 223 మంది మొదటి డోస్ వేసుకోగా.. 2 లక్షల 34 వేల 548 మంది రెండో డోస్ వేసుకున్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో 8 లక్షల 54 వేల 334 డోసుల వ్యాక్సిన్లు వేయగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 3 లక్షల 31 వేల 437 డోసులు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన వారు 4 లక్షల 2 వేల 204 మంది వ్యాక్సిన్లు వేసుకోగా.. వారిలో 2 లక్షల 9 వేల 12 మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే వేసుకున్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారు 2 లక్షల 10 వేల 926 మంది వ్యాక్సిన్లు వేసుకోగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్ష 14 వేల 698 మంది వేసుకున్నారు.
అపోహలు వద్దని ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో తాకిడి ఎక్కువగా ఉంటుదని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్ల వెల్లడించింది. 43.11 శాతం వ్యాక్సినేషన్‌తో దిల్లీ రెండో స్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి: రాష్ట్రపతి కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్ష