ETV Bharat / state

TOP TEN NEWS: టాప్‌టెన్ న్యూస్@5PM - తెలంగాణ టాప్‌టెన్ న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
TOP TEN NEWS
author img

By

Published : Feb 24, 2022, 5:05 PM IST

  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న కరీంనగర్​ విద్యార్థులు

Telangana Students in Ukraine: ఉక్రెయిన్​లో చిక్కుకున్న కరీంనగర్​కు చెందిన విద్యార్థులు సాయం కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు ఫోన్​ చేశారు. ప్రస్తుతం 20 మంది ఎయిర్​పోర్ట్​లో చిక్కుకున్నట్లు సంజయ్​కు వివరించారు. స్పందించిన సంజయ్​ వెంటనే విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. విద్యార్థులను భారత్​కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

  • భారత్ మద్దతు కోరుతున్నాం

Russia Ukraine crisis: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించింది. అన్ని వైపుల నుంచి దాడి చేస్తోంది. ఈ క్రమంలో భారత్​ మద్దతు కోరింది ఉక్రెయిన్​. ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్​ మద్దతు ఇవ్వాలని కోరారు భారత్​లో ఆదేశ రాయబారి ఇగోర్​ పొలిఖా. సంక్షోభ పరిష్కారానికి భారత ప్రధాని ముందుకు రావాలన్నారు.

  • మన ఊరు-మన పోరు

Congress Mana Ooru Mana Poru: తెలంగాణలో ఈ నెల 26 నుంచి "మన ఊరు - మన పోరు" సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు జూమ్‌ యాప్‌ ద్వారా సమావేశమైన పీసీసీ కార్యవర్గం పలు అంశాలపై చర్చించింది.

  • దెబ్బతిన్న మొగిలయ్య కిన్నెర

Mogilaiah Kinnera Damage : 12 మెట్ల కిన్నెర వాద్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు భీమ్లానాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్​లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాయించే కిన్నెర... పవన్ అభిమానుల తాకిడికి స్వల్పంగా దెబ్బతింది.

  • విపక్షాల ఆందోళన

Aler Protest: మహబూబాబాద్ జిల్లా ఆలేరులో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న యువతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.

  • విపక్షాలకు ఆ ధైర్యం లేదు

UP Election 2022: యూపీలో జరిగిన తొలి నాలుగు దశ ఎన్నికల్లో ఓటర్లు భాజపా వైపే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఓట్ల విభజనలో విపక్షాల లెక్క తప్పిందన్నారు. ఈ క్రమంలోనే కుటుంబ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

  • కుప్పకూలిన 1.32 లక్షల హైఓల్టేజీ టవర్​

Snowfall in Jammu and Kashmir: జమ్ముకశ్మీర్​లో భారీగా కురుస్తున్న మంచు వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హిమపాతం కారణంగా 1.32 లక్షల హైఓల్టేజీ టవర్​ కూలి.. ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది.

  • వార్​ ఎఫెక్ట్​.. మార్కెట్లు ఢమాల్​

Stock Market Close: ఉక్రెయిన్​- రష్యా యుద్ధంతో దేశీయ స్టాక్​ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్​ ఏకంగా 2,700 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 815 పాయింట్లు కోల్పోయింది.

  • కేటీఆర్​కు ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్

'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్​కు హాజరైన తెలంగాణ మంత్రి కేటీఆర్​కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు కథానాయకుడు పవన్ కల్యాణ్. కళకు ఎలాంటి బేధాలు లేవని ఆయన నిరూపించారని అన్నారు.

  • కెప్టెన్​గా అందుకే తప్పుకొన్నా

Virat Kohli: టీమ్​ఇండియా కెప్టెన్​గా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం సహా ఐపీఎల్​లో బెంగళూరు జట్టు సారథ్య బాధ్యతలను వదిలేసుకున్నాడు కోహ్లీ. దీనిపై అభిమానుల్లో చాలా ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిపై 'ది ఆర్​సీబీ పాడ్​కాస్ట్'​లో మాట్లాడుతూ విరాట్ వివరణ ఇచ్చాడు. ఆస్వాదించలేనప్పుడు తాను ఏ పనినీ చేయనని అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.