ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today
author img

By

Published : Dec 26, 2022, 12:59 PM IST

  • రాష్ట్రపతికి ప్రభుత్వం ఘనస్వాగతం..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి హైదరాబాద్​కు వచ్చిన ఆమెకు.. రాష్ట్ర ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీశైలం బయలుదేరిన ముర్ము.. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.

  • గిరిజన హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుల విద్యార్హతల్లో మార్పులు..

గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్​ పోస్టులకు నోటిఫికేషన్​తో టీఎస్​పీఎస్సీ ఇటీవల ఓ శుభవార్త చెప్పింది. దీంతో చాలా మంది ఎగిరిగంతేశారు. అయితే వారి సంతోషం ఎన్నో రోజులు నిలువలేదు. నోటిఫికేషన్​కు సంబంధించి అర్హత విషయంలో మార్పు చేయడంతో అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడింది.

  • వైద్యసీట్లలో తెలంగాణకు ఆరో స్థానం

రాష్ట్రంలో 'వైద్యవిద్య' అభివృద్ధి పథంలో సాగుతోంది. ఫలితంగా అత్యధిక ఎంబీబీఎస్‌ సీట్లున్న రాష్ట్రాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఇదే విధంగా పీజీ సీట్లలో ఏడో స్థానం.. సూపర్‌ స్పెషాలిటీలో పదో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజా నివేదికను విడుదల చేసింది.

  • రెండు కుటుంబాల్లో విషాదం నింపిన జన్మదిన వేడుకలు

అప్పటి వరకు స్నేహితులు, కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా సముద్రతీరంలో బర్త్​డే వేడుకలు జరుపుకున్నారు. అంతలోనే ఒక్కసారిగా విషాదం నెలకొంది. ముఖానికి అంటుకున్న కేక్​ను కడుక్కోవడానికి వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

  • మహాత్మా గాంధీ సహా మాజీ ప్రధానులకు రాహుల్​ గాంధీ నివాళి

భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. దిల్లీ చేరుకున్న ఆయన సోమవారం ఉదయం మహాత్మా గాంధీ సహా పలువురు మాజీ ప్రధానులకు నివాళులు అర్పించారు. జనవరి 3న తిరిగి భారత్ జోడో యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

  • ICICI బ్యాంక్​ కేసులో వీడియోకాన్​ ఛైర్మన్​ అరెస్ట్​

సీఐసీఐ బ్యాంక్​ రుణ మోసం కేసులో వీడియోకాన్​ వ్యవస్థాపకుడు వేణుగోపాల్​ దూత్​​ను సీబీఐ అరెస్ట్​ చేసింది.

  • తైవాన్​పై చైనా దూకుడు..

తైవాన్​కు అమెరికా మద్దతుగా నిలిస్తున్నందున చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. చైనా తమ గగలతలంలోకి 71 యుద్ధ విమానాలను పంపిందని తైవాన్​ ఆరోపించింది. తైవాన్, అమెరికా రెచ్చగొట్టే చర్యల కారణంగా ఈ కసరత్తులు జరిగాయని చైనా పేర్కొంది.

  • జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిఖత్‌

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి తన సత్తా నిరూపించింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ వేదికగా జరుగుతున్న జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.

  • సునీల్ గావస్కర్​ ఇంట తీవ్ర విషాదం..

దిగ్గజ ఆటగాడు, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఇంట విషాదం నెలకొంది. అతడి తల్లి మీనల్ గావస్కర్ తుది శ్వాస విడిచారు. అయినా గావస్కర్​ బాధను దిగమింగుకుని తన కామెంటరీ బాధ్యతలను నిర్వర్తించాడు.

  • అది చిరంజీవి అంటే.. తుపాను లెక్కచేయకుండా సముద్రంలో షూటింగ్ చేశారట!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సినిమాల్లో 'వాల్తేరు వీరయ్య' ఒకటి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపించడం కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని దర్శకుడు బాబీ అన్నారు. ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.