ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9AM - 9AM TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9AM TOPNEWS
9AM TOPNEWS
author img

By

Published : Dec 11, 2022, 8:58 AM IST

  • రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు దిల్లీ వెళ్లనున్నారు. పార్టీ పేరు మారిన తరువాత బీఆర్​ఎస్​ పేరుతో ఈనెల 14న ఆయన హస్తినలో కార్యాలయం ప్రారంభించనున్నారు.

  • 'బీజేపీకు దడ పుట్టిస్తాం.. భవిష్యత్తులో బీజేపీకి మరిన్ని కష్టాలు'

భారత్‌ రాష్ట్ర సమితికి జాతీయ పార్టీగా బంగారు భవిష్యత్తు ఉంటుందని.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. కేంద్రంలోని బీజేపీకి వణుకు పుట్టిస్తామన్నారు. రానున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కీలకంగా మారతామని తెలిపారు. దిల్లీ పర్యటన ముగిసిన తర్వాత శాసనసభ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

  • ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ.. నేడే విచారణ

దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి ఇవాళ సీబీఐ బృందం వెళ్లనుంది. కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వాంగ్మూలం నమోదు చేయనున్నట్లు సీబీఐ వెల్లడించింది. సాక్షిగా విచారణ జరిపేందుకు.. కవితకు సీబీఐ ఇప్పటికే సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చింది.

  • నగర వాసులకు తీపి కబురు.. త్వరలో అటవీ పార్కులు

నేటి సమాజంలో ప్రతి ఒక్కరు ఉరుకులు పరుగుల మీద జీవనం సాగిస్తున్నారు.. వారికి కనీసం ప్రశాంతంగా కూర్చోనే రోజే లేదు. దీంతో వారు మానసికంగా ఎంతో ఇబ్బందులు.. ఇంకా వీటితో పాటు ఎన్నో రోగాలు బారిన పడతారు. అందుకే వీటి అన్నింటిని దృష్టిలో ఉంచుకొని హెచ్​ఎండీఏ ఒక ఆలోచన చేసింది.

  • అంబేడ్కర్‌, పూలేపై అనుచిత వాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై సిరాతో దాడి

మహారాష్ట్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత చంద్రకాంత్‌పాటిల్‌పై ఓ దుండగుడు సిరాతో దాడి చేశాడు. పుణెలోని మిమ్రీ పట్టణంలో ఆయన పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది.

పుల్వామా దాడి నిందితుడికి షాక్.. జైషే మొహమ్మద్‌ కమాండర్‌ ఇల్లు నేలమట్టం

40 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని పొట్టన పెట్టుకున్న జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద ముఠా కమాండర్‌ ఆశిఖ్‌ నెంగ్రూకు చెందిన రెండంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న ఈ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు వారు తెలిపారు. కాగా శనివారం దీన్ని నెలమట్టం చేశారు.

  • సజీవ ఔషధం సిద్ధం.. అవయవ మార్పిడి రోగులకు వరం.. క్యాన్సర్​పైనా పోరు!

అవయవ మార్పిడి చేయించుకున్న రోగులు ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సమస్యకు శాస్త్రవేత్తలు విరుగుడును కనుగొన్నారు. ఇందుకోసం ఒక 'సజీవ ఔషధాన్ని' అభివృద్ధి చేశారు. ఇది అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు వరంలాంటిదని పరిశోధకులు భావిస్తున్నారు.

  • అసలే చలి కాలం.. ఆపై అలర్జీల దాడి

తుపాను ప్రభావంతో హైదరాబాద్​ వాతావరణం మారిపోయింది. దీంతో చలి తీవ్రత పెరిగింది. తద్వారా శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చాలా మంది అలర్జీల బారినపడి ఆసుపత్రిలో చేరుతున్నారు.

  • UPIకి మించి.. డిజిటల్‌ రూపాయితో ఎన్నో ప్రయోజనాలు.. రూ.వేల కోట్లు ఆదా!

డిజిటల్‌ రూపాయిని ఆర్​బీఐ ప్రయోగాత్మకంగా నాలుగు నగరాల్లో విడుదల చేసింది. ప్రస్తుతం మనం సులువుగా యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నాం. అయినా ఈ డిజిటల్‌ రూపాయి ఎందుకు అనే అనుమానాలు వస్తాయి. అయితే, డిజిటల్ రూపాయితో యూపీఐకి మించిన ప్రయోజనాలు ఉన్నాయి.

  • డబ్బింగ్ సినిమాలు సూపర్ హిట్.. వినోదాలు పంచి.. కోట్లు కురిపించి..

"సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ప్రేమించినట్లుగా మరెవరూ ప్రేమించలేరు".. తెలుగు వారి ముందుకొచ్చినప్పుడల్లా పరభాషా కథానాయకులు తరచూ చెప్పే మాటిది. ఇదేదో మన మెప్పు కోసం చెప్పే మాట కాదు. ఆ మాటలు అక్షర సత్యం కూడా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.