Telangana Tax Revenue 2022-23 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన పన్ను ఆదాయం లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదికలో ఆదాయ, వ్యయాలను ప్రభుత్వం పేర్కొంది. 2022-23లో రాష్ట్ర రెవెన్యూ రాబడులు అంచనా రూ.1,93,029 కోట్లు కాగా.. జనవరి నెలాఖరు వరకు రూ.1,20,479కోట్లు సమకూరాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 62 శాతానికిపైగా ఉంది.
Telangana Tax Revenue Has Crossed One Lakh Crore : ఇందులో పన్ను ఆదాయం రూ.1,02,197కోట్లు. బడ్జెట్ అంచనా అయిన రూ.1,26,606కోట్లలో ఇది 80 శాతానికిపైగా ఉంది. జీఎస్టీ ద్వారా రూ.34,729 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.11,806 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.24,745 కోట్లు వచ్చాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.9,205 కోట్లు ఖజానాకు చేరాయి. ఇతర పన్నుల రూపంలో రూ.7,112 కోట్లు సమకూరాయి. పన్నేతర ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 40శాతానికి పైగా ఉంది. ఈ ఏడాది రూ.25,421 కోట్ల పన్నేతర ఆదాయాన్ని అంచనా వేయగా... జనవరి నెలాఖరు వరకు రూ.10,405 కోట్లు వచ్చాయి.
Telangana Tax Revenue Increased in 2023 : కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు మాత్రం బడ్జెట్ అంచనాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం అన్ని రకాలుగా రూ.41,001 కోటి గ్రాంట్లుగా వస్తాయని అంచనా వేయగా.. మొదటి పది నెలల్లో రూ.7,876 కోట్లు మాత్రమే వచ్చాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది కేవలం 19 శాతం మాత్రమే.
జనవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి రూ.33, 416 కోట్ల రుణాల ద్వారా సమీకరించుకుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.52, 227 కోట్లలో ఇది 64 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో రాష్ట్ర ఖజానాకు అన్ని రకాలుగా రూ.1,54,518 కోట్లు చేరాయి. బడ్జెట్ అంచనా ఆదాయాలు రూ.2,45,256 కోట్లలో ఇది 63శాతం. డిసెంబర్‌తో పోలిస్తే జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన పన్ను ఆదాయం స్వల్పంగా తగ్గింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలలో అత్యధికంగా రూ.11, 213 కోట్ల ఆదాయం రాగా... జనవరిలో కాస్తా తగ్గి రూ.10,310 పన్నుల ద్వారా సమకూరాయి. పన్నేతర ఆదాయం కూడా డిసెంబర్‌తో పోలిస్తే తగ్గింది. కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు కూడా స్వల్పంగానే ఉన్నాయి. జనవరిలో రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో రూ.105 కోట్లు మాత్రమే వచ్చాయి.
జనవరి ముగిసే నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చు మొత్తం రూ.1,38,206కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,24,681కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.13,524 కోట్లు మాత్రమే. వడ్డీ చెల్లింపుల కోసం జనవరి వరకు రూ.1,7 55 కోట్లు, వేతనాల కోసం రూ.29, 609 కోట్లు ఖర్చు చేశారు. పెన్షన్ల కోసం రూ.13,118 కోట్లు, రాయితీల కోసం రూ.7,378 కోట్లు వ్యయం అయింది.
ఇవీ చదవండి: