తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ రాబడులు 2020 నవంబరులో భారీగా పెరిగింది. 2019 నవంబరు నెలలో రూ.3,886 కోట్లు పన్నుల రాబడులు రాగా... 2020 నవంబరులో రూ.6876.51 కోట్లు ఆదాయం వచ్చి 77శాతం వృద్ది నమోదు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
విభాగం, వ్యాట్ రూపంలో | 2019 నవంబరులో ఆదాయం రూ. కోట్లలో | 2020 నవంబరులో ఆదాయం రూ. కోట్లలో |
పెట్రోల్‌పై వ్యాట్ | 746 | 804.62 |
మద్యం అమ్మకాల ద్వారా | 950 | 1100 |
ఎస్‌జిఎస్టీ | 1173 | 1077.39 |
ఐజీఎస్టీ | 945 | 1025.28 |
ఐజీఎస్టీ సెటిల్మెంట్ | 0 | 2638 |
జీఎస్టీ పరిహారం | 0 | 164.41 |
ఇతర పన్నుల ద్వారా | 72 | 66.81 |
మొత్తం రాబడులు | 3886 | 6876.51 |
గతేడాది నవంబరులో ఐజీఎస్టీ సెటిల్మెంటు ద్వారా ఒక రూపాయి కూడా రాకపోగా... గత నెలలో ఏకంగా రూ.2,638 కోట్లు వచ్చింది. మరో రూ.164.41 కోట్లు పరిహారం కింద రాష్ట్రానికి రావడం వల్ల వస్తు సేవల పన్ను ఆదాయం భారీగా వచ్చినట్లయ్యిందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కొవాగ్జిన్ టీకా సురక్షితమే: భారత్ బయోటెక్