కేసీఆర్ ప్రకటించిన నియంత్రిత వ్యవసాయ విధానంపై రైతు సంఘం పలు సూచనలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసింది. ప్రణాళిక బద్ధంగా పంటలు పండించటాన్ని రైతు సంఘం నాయకులు స్వాగతించారు. అన్నదాతలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరింది. భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని సూచించింది. కర్ణాటక ప్రభుత్వం నియమించినట్లు ధరల కమిషన్ నియమించాలని... మద్దతు ధర కల్పించాలని కోరింది. పంట వేయటానికంటే ముందే మద్దతు ధరలను ప్రకటించాలని విన్నవించింది.
నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం చేపట్టాలని కోరింది. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉండగా 30 లక్షల మందికి మాత్రమే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయని పేర్కొంది. రుణాలు అందరికి అందేలా చూడాలని తెలిపింది. ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని కోరింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వీటితో పాటు మార్కెట్ కమిటీల పని తీరు, క్రాప్ కటింగ్ నమూనాల సేకరణ, నీటి వినియోగం తదితర అంశాలపై సూచనలు చేసింది.