ETV Bharat / state

ఆర్టీఏ అధికారుల వేధింపులు.. హెచ్చార్సీలో లారీయజమానుల ఫిర్యాదు - telangana state lorry association meet human rights commotion

తమ లారీలను రోడ్లపై అకారణంగా ఆపుతూ కొంత మంది ఆర్టీఏ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలంగాణ లారీ యజమానుల సంఘం రాష్ట్ర మానవహక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని.. జీవనోపాధిని కల్పించాలని వారు కమిషన్​కు విజ్ఞప్తి చేశారు.

telangana-state-lorry-association-meet-human-rights-commotion-at-hyderabad
ఆర్టీఏ అధికారుల వేధింపులు.. హెచ్చార్సీలో లారీయజమానుల ఫిర్యాదు
author img

By

Published : Jun 18, 2020, 4:49 PM IST

కొంత మంది ఆర్టీఏ తమ లారీ యజమానులను, డ్రైవర్లను వేధిస్తున్నారంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం రాష్ట్ర మానవహక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేసింది. రోడ్లపై తమ లారీలను ఆర్టీఏ అధికారులు అకారణంగా అపుతూ... వారం తరబడి రోడ్లపైనే ఉంచుతున్నారని వారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

దానితో తాము జీవనోపాధి కోల్పోయి... లారీపై తీసుకున్న లోన్లు కట్టలేక నానా తిప్పులు పడుతున్నామని లారీ డ్రైవర్లు, యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ... తమ జీవనోపాధిని దెబ్బ కొడుతున్న అధికారులపై చర్యలు తీసుకుని... తమకు న్యాయం చేయాలని వారు రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ను వేడుకున్నారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్​ కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.