కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతోపాటు... హైకోర్టు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లాక్డౌన్ ప్రకటించింది.
ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. క్యాంప్ ఆఫీస్ నుంచే తగు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. అత్యవసర ఫిర్యాదుదారులు ఎవరైనా ఈ- మెయిల్ ద్వారా కమిషన్ను ఆశ్రయించాలని సూచించింది.