దేశంలో నమోదైన తొలి కరోనా మరణంతో హైదరాబాద్‌కు సంబంధం ఉండటం వల్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలన్నింటిని అప్రమత్తం చేశామని ఆ శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. మృతుడితో సంబంధం ఉన్న వారందర్నీ గుర్తించామని, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
విదేశాల నుంచి వస్తున్న వారందరిని పరిశీలించడానికి ప్రత్యేకంగా ఓ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 70 మంది సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని డాక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. కరోనా లక్షణాలున్న రోగుల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులను మరోసారి అప్రమత్తం చేశామంటోన్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చూడండి : ప్రపంచవ్యాప్తంగా 5 వేలకు చేరిన కరోనా మరణాలు