.
'అన్ని రకాల డిపాజిట్ల వివరాలు సాయంత్రంలోగా ఇవ్వాలి' - తెలంగాణ ఆర్థిక శాఖ
లాక్డౌన్ కారణంగా పూర్తి స్థాయిలో ఆదాయాలు పడిపోయిన వేళ డిపాజిట్ల వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరింది. అన్ని రకాల డిపాజిట్లకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని తెలిపింది. ఆయా శాఖల్లోని శాఖాధిపతులు, యూనిట్ కార్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, మార్కెట్ కమిటీల డిపాజిట్ల వివరాలు ఆర్థికశాఖ కోరింది. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని స్పష్టం చేసింది. సాయంత్రం లోపు వివరాలు అందించాలని సూచించింది.
Telangana state finance department latest news
.