Internship for Degree Students in Telangana : అమెరికా వంటి దేశాల్లో విద్యార్థులంతా ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ తమ పాకెట్ మనీ సంపాదించుకుంటారు. ఇలాంటి విధానం త్వరలో ఇండియాలోనూ రానుంది. అది కూడా తెలంగాణలో. అదెలాగంటే.. డిగ్రీ కళాశాలలో చేరిన మొదటి నెల నుంచే విద్యార్థులు రూ.10 వేల వేతనం అందుకునే అవకాశం కల్పించాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. రాష్ట్రంలో ఈ కొత్త విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచే 103 కళాశాలల్లో ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
Telangana Govt provides Internship for Degree Students : కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో అవసరమై మేర కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. అయితే ఉన్నత అధికారులే ఆయా ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విద్యార్థులు వారంలో మూడు రోజులు కళాశాలలో పాఠాలు వినాల్సి ఉంటుంది. అలాగే మరో మూడు రోజులు పని చేయాల్సి ఉంటుంది.
37 ప్రభుత్వ, 66 ప్రైవేటు కళాశాలలు: రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, 66 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఈ ఇంటర్న్‌షిప్ విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థుల సంఖ్య 500 మించి ఉండాలనే నిబంధనలను పాటించారు. దీనిలో కొన్ని షరతులు కూడా ఉన్నాయండోయ్. అన్ని కోర్సుల్లో కాకుండా ఎంపిక చేసిన 10 కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి మాత్రమే రూ.10 వేల వేతనం వర్తిస్తుంది.
Internship for Degree Students: బీబీఎస్(ఈ-కామర్స్), బీబీఏ(లాజిస్టిక్స్), బీబీఏ(రిటైలింగ్), బీఎస్‌సీ(ఫిజికల్ సైన్స్), బీఏ(కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్)లో చేరిన వారికి ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వీటితోపాటు బీకాం(హాస్పిటల్ మేనేజ్‌మెంట్), బీకాం(ఈ-కామర్స్)తోపాటు మరికొన్ని కలిపి మొత్తం 10 కోర్సుల వరకు కొత్త విధానంలోకి తీసుకోవాలన్నది రాష్ట్ర ఉన్నత విద్యామండలి లక్ష్యంగా కనిపిస్తోంది. కాకపోతే ఒక్కో కళాశాలలో ఒకటి లేదా రెండు కోర్సులకు మాత్రమే ఈ అవకాశం కల్పింస్తారు.
పేద తల్లిదండ్రులపై భారం ఉండదు: ఎంతో మంది పేద విద్యార్థులు ‘దోస్త్’తో హైదరాబాద్, ఇతర నగరాలకు వచ్చి పేరెన్నికైన డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి అన్నారు. వారికి హాస్టల్, ప్రయాణ, ఇతర ఖర్చులు భారంగా మారుతున్నాయని తెలిపారు. దానికితోడు డిగ్రీ పూర్తయితే చదువుకు తగ్గ కొలువును సాధించుకోవచ్చన్న నమ్మకాన్ని ప్రస్తుతం వారికి ఇవ్వలేకపోతున్నామని పేర్కొన్నారు.
ఈ పరిస్థితిని మార్చేందుకే కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ పరిధిలోని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎస్‌డీసీ) సహకారం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. వారంలో మూడు రోజులపాటు పరిశ్రమలు, ఇతర స్టోర్లలో పనిచేస్తే ఆ హాజరును పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. మొత్తానికి పేద తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పడంతోపాటు విద్యార్థులకూ కొలువుకు తగిన నైపుణ్యాన్ని సాధించామన్న ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వగులుగుతామని చెప్పారు.
ఇవీ చదవండి: