ETV Bharat / state

క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం: శ్రీనివాస్‌ గౌడ్‌ - హైదరాబాద్​ తాజా వార్తలు

రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, కోచ్‌లకు పెద్దపీట వేస్తామని తెలిపారు.

telangana sports-minister-srinivas
తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్​ గౌడ్​
author img

By

Published : Jan 2, 2021, 1:42 PM IST

Updated : Jan 2, 2021, 2:13 PM IST

రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ ఎల్​బీ స్టేడియం వేదికగా రెండో రోజు జరుగుతున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల వైద్యుల క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. వైద్యులు ఆరోగ్యంగా ఉండేందుకు మానసికంగా ఉల్లాసం కల్పించేందుకు క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు.

రాష్ట్ర టెన్నిస్​ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ తెలంగాణ​ ఆధ్వర్యంలో టెన్నిస్​ క్రీడా అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, కోచ్‌లకు పెద్దపీట వేస్తామని తెలిపారు. త్వరలోనే అత్యుత్తమమైన క్రీడా పాలసీ తీసుకొస్తామని స్పష్టం చేశారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి వివరించారు.

తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్​ గౌడ్​

ఇదీ చదవండి: ఒకరి నుంచి 22మందికి కరోనా.. ఉలిక్కిపడ్డ సూర్యాపేట

Last Updated : Jan 2, 2021, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.