ETV Bharat / state

గాంధీ కలలను కేసీఆర్ సాకారం చేస్తున్నారు: పోచారం - అసెంబ్లీలో గాంధీ జయంతి వేడుకలు

అహింసా మార్గంతో మహాత్ముడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బ్రిటిష్ వారి కబంద హస్తాల నుంచి దేశానికి విముక్తి కలిగించారని కొనియాడారు. దేశ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడని ప్రశంసించారు. గాంధీజీ కలలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. శాసనసభ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

telangana-speaker-pocharam-srinivas-reddy-participated-in-the-gandhi-jayanti-celebrations-in-assembly
గాంధీ కలలను కేసీఆర్ సాకారం చేస్తున్నారు: పోచారం
author img

By

Published : Oct 2, 2020, 2:24 PM IST

బ్రిటిష్ వారి కబంద హస్తాల నుంచి దేశాన్ని విడిపించి, దేశ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన యోధుడు గాంధీ అని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. తన అహింసా మార్గంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి గాంధీజీ అని అన్నారు. మహాత్ముని కలలను సీఎం కేసీఆర్ సాకారం చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలకు ఆయన జయంతి ఓ పండుగ అని... అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

గాంధీ కలలను కేసీఆర్ సాకారం చేస్తున్నారు: పోచారం

ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మండలి చీఫ్ బోడకంటి వెంకటేశ్వర్లు, శాసనసభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

"గాంధీజీ పిలుపు గ్రామ స్వరాజ్యం. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు లేవు, మంచినీటి బాధలు లేవు, పల్లెలు స్వచ్ఛందంగా తయారవుతున్నాయి. పట్టణాల్లో సౌకర్యాలు మెరుగయ్యాయి. మనది ఫెడరల్ స్ఫూర్తి. భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి. ఆ స్ఫూర్తిని కాపాడే దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మహాత్మా గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలంటే అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందాలి. గతేడాది లండన్ పర్యటనలో ఉన్న నేను అక్కడి గాంధీ పార్కులోని విగ్రహానికి నివాళులు అర్పించాను."

-పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ సభాపతి

ఇదీ చదవండి: 'మహాత్ముని అడుగుజాడల్లో నడవడమే నేటితరం ఆయనకిచ్చే ఘననివాళి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.