Telangana SI Results Released : రాష్ట్రంలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టుల తుది ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. 587 పోస్టులకు ఎన్నికైన వారి జాబితా ప్రకటించింది. 434 మంది పురుషులు, 153 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి తెలిపింది. గతసంవత్సరం సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు.. ఏప్రిల్ 25న టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 7న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. దాదాపు 2.47 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఆక్టోబర్ 2022లో సివిల్ ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఈ పరీక్షలో 46.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అనంతరం వీరికి దేహధారుడ్య పరీక్షలు నిర్వహించి.. అందులో ఉత్తీర్ణులైన వారికి తుదిరాత పరీక్ష నిర్వహించింది. ఇటీవలే ఆ ఫలితాలను కూడా విడుదల చేశారు. అందులో ఎస్‌ఐ సివిల్ 43,708 మంది, ఎస్‌ఐ ఐటీ అండ్ కమ్యూనికేషన్‌కు 729 మంది, ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్‌ఐ పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఎస్‌ఐ పోస్టులకు 463 మంది ఎంపికయ్యారు.
TSLPRB Released SI Results : ఈ క్రమంలోనే అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను.. జూన్ 14 నుంచి 26 వరకు పరిశీలించారు. ఈ మేరకు 18 కేంద్రాలను పోలీసులు ఏర్పాటు చేశారు. తుది ఎంపిక జాబితాలో పేరున్నా గానీ.. అప్పుడే ఉద్యోగపత్రం అందుకునే అవకాశం మాత్రం ఉండదు. ఆ జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన నేపథ్యం, ప్రవర్తన, నేరచరిత్ర.. తదితర అంశాలను టీఎస్ఎల్పీఆర్బీ ఆరాతీయనుంది. ఈ ప్రక్రియను జిల్లాల వారీగా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) చేపట్టనుంది.
TS Police Results 2023 : పోలీస్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
TS SI Results Released : క్రిమినల్ అండ్ క్రైమ్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్‌ఎస్) డేటాను విశ్లేషించడంతోనే సరిపెట్టకుండా.. క్షేత్రస్థాయి పరిశీలనపైనా కూడా ఎస్‌బీ దృష్టి సారించనుంది. విజేతల తాత్కాలిక, శాశ్వత చిరునామాల్లో పర్యటించి అక్కడి పోలీస్ స్టేషన్లలో ఏమైనా కేసులున్నాయా..? అని పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన నివేదికను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలికి పంపనున్నారు. ఆ నివేదికలో క్లీన్‌చిట్ లభిస్తేనే ఆ తర్వాత ఉద్యోగపత్రం అందుకుంటారు. దీన్నిబట్టి ఆగస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఫైర్, జైళ్లు ఎక్సైజ్.. ఇలా అన్ని విభాగాలకు పంపించనుంది.
మరోవైపు తుది రాత పరీక్షలో కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యూనికేషన్‌కు 4,564 మంది, డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ పోస్టులకు 1,779 మంది, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్‌కు 283 మంది చొప్పున అర్హత సాధించారు. వారి ధ్రువపత్రాలను.. జూన్ 14 నుంచి 26 వరకు పరిశీలించారు. ఈ మేరకు 18 కేంద్రాలను పోలీసులు ఏర్పాటు చేశారు.
TS Constable Exam Preliminary Key : పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ 'కీ' విడుదల
Telangana Police SI 2023 : త్వరలోనే ఎస్సై, కానిస్టేబుళ్ల తుది ఎంపికల జాబితా వెల్లడి!