ETV Bharat / state

Telangana Secretariat Temples Inauguration : సచివాలయంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభం.. 3 మతాల వారికి ప్రాధాన్యం దక్కిందన్న కేసీఆర్ - నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం

Telangana Secretariat Temples Inauguration : రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంతో పాటు మసీదు, చర్చిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అన్ని మతాలకు ప్రాధాన్యమివ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని కేసీఆర్ అన్నారు.

TS Secretariat
Telangana Secretariat Temples
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 1:14 PM IST

Updated : Aug 25, 2023, 4:48 PM IST

Telangana Secretariat Temples Opening

Telangana Secretariat Temples Inauguration : రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం(Nalla Pochamma Temple at Secretariat)తో పాటు మసీదు, చర్చ్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సచివాలయానికి నైరుతిలో నిర్మించిన నల్ల పోచమ్మ అమ్మవారితో పాటు శివాలయం, అంజనేయ స్వామి ఆలయాలను నిర్మించారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన, విగ్రహాలకు ప్రతిష్ట జరిగింది.

Nalla pochamma Temple at TS Secretariat : ప్రారంభోత్సం సందర్భంగా.. సచివాలయంలోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో గత రెండ్రోజుల నుంచి ఆలయ ప్రతిస్థాపనా క్రతువులు జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఆలయాలకు శాస్త్రోక్తంగా ప్రతిస్థాపన వేడుకలు జరగాయి. మొదటి రోజు ముందుగా గణపతి పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రహదార్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు దంపతులు పాల్గొన్నారు.

Telangana Secretariat Nalla pochamma Temple : రెండో రోజు స్థాపిత పూజ, ప్రతిష్టాపన హోమం, తిరుమంజసం, మహాలక్ష్మియాగం, ఫల పుష్పాదివాసం, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. ఇవాళ మూడో రోజున.. ఉదయం నుంచి చండీయాగం, దిగ్బలి, ప్రాణ ప్రతిష్ట హోమం, ధ్వజస్థంభ ప్రతిష్టాపన చేపట్టగా.. అనంతరం యంత్ర ప్రతిష్టాపన.. విగ్రహాల ప్రతిష్ట, శిఖర కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహా పూర్ణాహుతి, మహా మంగళహారతి కార్యక్రమాల్లో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. మంత్రులు హరీశ్​రావు, వేముల ప్రశాంత్​రెడ్డి, పువ్వాడ అజయ్‌, కొప్పుల ఈశ్వర్‌, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ శాంతికుమారి(CS Shanti Kumari) అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Worship Places in Telangana Secretariat : సచివాలయ ప్రార్థనా మందిరాల ఓపెనింగ్​కు ముహూర్తం ఫిక్స్.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Telangana Secretariat Temples Opening : నల్లపోచమ్మ ఆలయం కార్యక్రమాలు ముగిసిన అనంతరం, పక్కనే ఉన్న చర్చి ప్రారంభోత్సవాల్లో గవర్నర్‌, ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై, కేసీఆర్‌ కేక్‌ కట్‌ చేసి.. చర్చ్‌ను ప్రారంభించారు. తర్వాత సచివాలయం ఆవరణలోనే నూతనంగా నిర్మించిన మసీదు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్‌, ముఖ్యమంత్రి కేసీఆర్, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మూడు మతాల వారికి ప్రాధాన్యం దక్కిందన్నారు. ఈ మేరకు సచివాలయ ప్రాంగణలో గుడి, మసీదు, చర్చి నిర్మించామని తెలిపారు.

Telangana Governor Visits Secretariat Today : నేడు తొలిసారిగా సచివాలయానికి గవర్నర్ తమిళిసై

Nalla Pochamma Temple at Secretariat : సచివాలయ నల్లపోచమ్మ గుడి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. సీఎం కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభం

వేడుకలు జరగకుండా చేయాలని ప్లాన్‌ వేశారు... ప్రభుత్వంపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు!

Last Updated : Aug 25, 2023, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.