ETV Bharat / state

Telangana Revenue Till August 2023 : తెలంగాణలో ఆగస్టు వరకు లక్ష కోట్ల రెవెన్యూ.. బడ్జెట్​ అంచనాలు అందుకునేనా..? - తెలంగాణ ఆర్థిక గణాంకాలు

Telangana Revenue Till August 2023 : ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయలు సమకూరాయి. పన్నుల ద్వారా రూ.55వేల కోట్లకు పైగా రాగా.. పన్నేతర ఆదాయం ద్వారా రూ.14వేల కోట్లకు పైగా నిధులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో సర్కార్ రూ.95 వేల కోట్ల రూపాయల వ్యయం చేసింది. బడ్జెట్ అంచనాలో ఇది 38 శాతంగా ఉంది.

Telangana Economic Status
Telangana Economic Status till August 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 7:35 AM IST

Telangana Revenue Till August 2023 : 2023 - 24 ఆర్థిక సంవత్సరం(Financial Year)లో ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.72,933 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చింది. బడ్జెట్(Budget 2023-2024) అంచనాలో దాదాపు 34 శాతం వరకు ఉంది. పన్నుల రూపంలో మొదటి ఐదు నెలల్లో రూ.55,441 కోట్లు సమకూరాయి. బడ్జెట్ అంచనాలో ఇది 36 శాతానికి పైగా ఉంది.

జీఎస్టీ(GST) ద్వారా రూ.18,754 కోట్లు, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,852 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.12,386 కోట్లు ఖజానాకు వచ్చాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.10,149 కోట్లు రాగా.. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.5,064 కోట్లు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో రూ.3,234 కోట్లు వచ్చాయి. 2023-24లో ఆగస్టు నెలలో అత్యధికంగా రూ.12,729 కోట్లు పన్నుల ద్వారా సమకూరాయి.

Telangana Financial Statistics 2023 : పన్నేతర ఆదాయం ఆగస్టు నెలలో భారీగా వచ్చింది. జులై వరకు రూ.1,815 కోట్లు పన్నేతర ఆదాయం ద్వారా రాగా.. ఒక్క ఆగస్టులోనే రూ.12,666 కోట్లు సమకూరాయి. హైదరాబాద్ ఓఆర్​ఆర్​(ORR) లీజు, మద్యం దరఖాస్తులు, భూముల అమ్మకానికి సంబంధించిన నిధులు రావడంతో ఆ మొత్తం భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో ఆగస్టు నెలాఖరు వరకు కేవలం 3 వేల 9 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. బడ్జెట్ లో రూ.41,259 కోట్లు గ్రాంట్ అంచనా వేయగా.. అందులో కేవలం 7 శాతం మాత్రమే వచ్చింది.

Telangana Tax Revenue Increased : 4 నెలల్లో.. రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపంలో రూ. 42,712 కోట్లు

Telangana Economic Statistics Till August 2023 : ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.26,158 కోట్ల రుణం తీసుకొంది. అన్ని రకాలుగా ఖజానాకు రూ.99,104 కోట్లు వచ్చాయి. బడ్జెట్ అంచనా అయిన రూ.2,59,861 కోట్లలో ఇది 38 శాతంగా ఉంది. ఆగస్టు నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.95,081 కోట్లను ఖర్చు చేసింది. బడ్జెట్ అంచనా అయిన రూ.2,49,209 కోట్లలో ఇది 38 శాతం. రెవెన్యూ వ్యయం రూ.76,648 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.18,432 కోట్లుగా ఉంది. రెవెన్యూ వ్యయం కింద ఆగస్టు నెలలో ఏకంగా రూ.19,316 కోట్లను ఖర్చు చేశారు.

రంగాల వారిగా ఆగస్టు నెలలో ఖర్చులు : రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై రూ.21,836 కోట్లు.. సామాజిక రంగంపై రూ.29,274 కోట్లు.. ఆర్థికరంగంపై రూ.43,970 కోట్లు ఖర్చు చేసింది. ఆగస్టు నెలాఖరు వరకు వడ్డీల చెల్లింపుల కోసం రూ.8,851 కోట్లు.. వేతనాల కోసం రూ.16,937 కోట్లను వ్యయం చేసింది. పెన్షన్ల కోసం రూ.6,973 కోట్లు.. రాయతీల కోసం రూ.4014 కోట్లను ఖర్చు చేసింది.

రూ.2.16 లక్షల కోట్ల ఆదాయం.. బడ్జెట్లో ప్రభుత్వం అంచనా

రాష్ట్ర బడ్జెట్​ 2023.. సాగుకు భళా.. సంక్షేమ కళ.. పేదల గూటికి ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.