ETV Bharat / state

Telangana Power Politics : 'కాంగ్రెస్ నేతలకు 'కరెంట్' షాక్ తగిలింది.. రైతులకు క్షమాపణ చెప్పాల్సిందే' - Palla Rajeshwarreddy latest comments

BRS Ministers on Congress current dispute : ఉచిత విద్యుత్‌పై జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ విధానమేంటో చెప్పాలని బీఆర్ఎస్ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఉచిత విద్యుత్‌పై మాట్లాడి కాంగ్రెస్‌ సెల్ఫ్‌గోల్‌ చేసుకుందని ఎద్దేవా చేశారు. రేవంత్‌ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని విజ్ఞత చూపాలని సూచించారు. రైతులకు రేవంత్‌ క్షమాపణ చెప్పాలన్న మంత్రులు.. పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం గాలిలో దీపమేనని విమర్శించారు.

BRS
BRS
author img

By

Published : Jul 15, 2023, 2:22 PM IST

ఇవాళ దొరికిన దొంగ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు: జగదీశ్‌రెడ్డి

BRS Ministers fires on Congress : రాష్ట్రంలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు సమీపిస్తుడటంతో ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలపై తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన 'పవర్​ పాలిటిక్స్'​ అంశం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా బీఆర్​ఎస్​పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఆ పార్టీ మంత్రులు నిరంజన్​రెడ్డి, జగదీశ్​రెడ్డి తిప్పికొట్టారు.

BRS on Congress Free Power Cancel Comments : ఉచిత విద్యుత్‌పై జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ విధానమేంటో చెప్పాలని మంత్రులు నిరంజన్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఉచిత విద్యుత్‌పై మాట్లాడి కాంగ్రెస్‌ సెల్ఫ్‌గోల్‌ చేసుకుందని ఎద్దేవా చేశారు. రేవంత్‌ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని విజ్ఞత చూపాలని అమాత్యులు సూచించారు. రైతులకు రేవంత్‌ క్షమాపణ చెప్పాలన్న మంత్రులు... పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం గాలిలో దీపమేనని విమర్శించారు. నాణ్యమైన నిరంతర విద్యుత్‌ ఇస్తే కాంగ్రెస్‌ నేతల కడుపు మండుతోందని ఆక్షేపించారు.

Niranjan Reddy fires on Congress : కాంగ్రెస్‌ పాలనలో 9 గంటలు మాత్రమే విద్యుత్‌ ఇచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఆ ఇచ్చిన 9 గంటలు కూడా సరిగ్గా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్‌ కూడా కీలకమైన అంశంగా పేర్కొన్న నిరంజన్‌రెడ్డి... గతంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్‌ విద్యుత్‌ అంశంపై లేఖ రాశారన్నారు. చరిత్ర తెలియని వారు.. చరిత్రలో భాగస్వామ్యం లేని వారు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. విద్యుత్‌ అంశంపైనే చంద్రబాబుతో కేసీఆర్‌ విభేదించారని పేర్కొన్నారు. కరెంటు కష్టాలు, తాగునీటి సమస్యపైనే తెలంగాణ మలిదశ ఉద్యమం వచ్చిందని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

'తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ మెుదటి స్థానంలో ఉంది. ఇవాళ తెలంగాణ.. దేశంలోనే విద్యుత్‌ మిగులు ఉన్న రాష్ట్రం. విద్యుత్‌ సమస్యతో ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పని కూడా ఆగట్లేదు. 24 గంటల విద్యుత్‌ను గతంలో కాంగ్రెస్‌ వ్యతిరేకించలేదు. 24 గంటల విద్యుత్‌ ఇస్తే నేనే మీ తరపున ప్రచారం చేస్తానని అప్పట్లో జనారెడ్డి అన్నారు. కొందరు సబ్‌స్టేషన్ల వద్దకు వెళ్లి గంటో.. అరగంటో లేదని లెక్కలు చూపుతున్నారు. సాంకేతిక సమస్యలతో గంటో.. అరగంటో అంతరాయం రాదా? విద్యుత్‌ కొనుగోళ్లు అన్నీ ఆన్‌లైన్‌లో సాగుతాయి. విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి అని మాట్లాడటం అవివేకం.' - నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

కాంగ్రెస్‌ పార్టీకి విద్యుత్‌ షాక్‌ తగిలింది : విమర్శల కోసం విపక్షాలు వేరే రంగాలను ఎంచుకోవడం మంచిదని నిరంజన్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్‌ పార్టీకి విద్యుత్‌ షాక్‌ తగిలిందన్న ఆయన... రేవంత్‌ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని విజ్ఞత చూపాలన్నారు. తన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇంతగా అండ ఉన్న ప్రభుత్వం.. 70 ఏళ్లలో ఏదీ లేదన్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతులు సాగు కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నేతల విధాన రూపకల్పన దిల్లీ నుంచి జరగాలన్న నిరంజన్​... పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ఎద్దేవా చేశారు.

Jagadeeshreddy fires on Congress : అన్నిరంగాలకు నిరంతర విద్యుత్‌ ఉన్నప్పుడు.. రైతులకు ఎందుకు ఉండొద్దని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మనసులో ఉన్న విషయాన్ని తొందరపాటుతో బయటపెట్టారన్నారు. గతంలో విద్యుత్‌ కోసం రాత్రి వేళ పొలాలకు వెళ్లి ఎందరో రైతులు చనిపోయారని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ దొరికిన దొంగ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

'మీ ఇంట్లో 24 గంటలు అవసరమైనప్పుడు.. రైతులకు ఎందుకు ఉండొద్దు? ఫలానా 3 గంటలే ఇస్తామంటే.. రోజంతా రైతు ఆ సమయం కోసం ఎదురుచూడాలా? కాంగ్రెస్‌ పార్టీ.. ఎక్కడైనా 24 గంటల కరెంట్‌ ఇస్తామని చెప్పిందా? గతంలో విద్యుత్‌ కోసం టీడీపీలో ఉండి రేవంత్‌రెడ్డి ధర్నాలు చేయలేదా? ఉమ్మడి ఏపీలో పారిశ్రామికవేత్తలు కూడా విద్యుత్‌ కావాలని ధర్నాలు చేశారు. అవినీతిపై పేటెంట్‌ కాంగ్రెస్‌దే.. అందులో సందేహం లేదు.' - జగదీశ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి

రైతులకు రేవంత్​రెడ్డి క్షమాపణలు చెప్పాలి : ఉచిత కరెంట్‌ ఇస్తున్న కేసీఆర్‌ కావాలా..? మూడుగంటే ఇస్తామంటున్న కాంగ్రెస్‌ కావాలో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సూచించారు. ఉచిత విద్యుత్‌ ద్వారా యాసంగిలో 56 లక్షల ఎకరాలు పండించారన్న పల్లా.. ఉచిత కరెంట్‌ అనేది కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన వరమన్నారు. తెలంగాణ రైతులకు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని పల్లా రాజేశ్వర్​రెడ్డి డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.