TS Polycet Counselling New dates in Telangana : ఇంజినీరింగ్ సీట్లను పెంచిన మాదిరిగానే తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ప్రభుత్వం మరో 1170 సీట్లను పెంచింది. 11 పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు, అదనపు సీట్లకు అనుమతిస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, పాలీసెట్ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌లోనూ పలు మార్పులు చేసింది. శుక్రవారం (జులై 7న) పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానుండటం, సీట్ల పెంపు నేపథ్యంలో ఈ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు పేర్కొంది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. జులై 8, 9 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 10న పాలీసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. జులై 8 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 14న తుది విడత పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్ల కేటాయిస్తారు. ఈనెల 19, 20 తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయి. ఈనెల 21న పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభం అవుతాయని విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు.
SSC Supplementary 2023 results : రాష్ట్రంలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలకు రంగం సిద్ధమైంది. సమాధాన పత్రాల మూల్యాంకనల ప్రక్రియ పూర్తి చేశారని అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. జూన్ 14 నుంచి జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70వేల మంది విద్యార్థులు రాశారు. ఫలితాలను వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు.
అలాగే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చేశారు. అదనపు సీట్ల(14,565)కు అనుమతి రావడంతో పాటు.. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాకపోవడంతో షెడ్యూల్లో మార్చారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రేపు లేదా ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం జులై 7, 8 తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఈనెల 9న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఈనెల 12 వరకు పొడిగించినట్లు విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు.
Engineering Seats in Telangana : మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వ అనుమతి
Engineering College Counselling Dates in TS : ఈనెల 16న ఇంజినీరింగ్ తొలి విడత సీట్లను కేటాయిస్తారు. ఈనెల 16 నుంచి 22 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 24న ప్రారంభం కానుందని అన్నారు. ఈనెల 24 నుంచి 27 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుదని ఆమె తెలిపారు. ఈనెల 31న రెండో విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయించి.. మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతారని అన్నారు. ఆగస్టు 4 నుంచి 6 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి.. 9 వ తేదీన తుది విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. సీట్లు వచ్చిన విద్యార్థులు ఆగస్టు 9 నుంచి 11 వరకు కాలేజీల్లో చేరాలని సూచించారు. ఆగస్టు 10న స్పాట్ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలు విడుదల చేయనున్నారని పేర్కొన్నారు.
ఇంజినీరింగ్ షెడ్యూల్ కొత్త తేదీలు క్రింది విధంగా ఉన్నాయి:
క్రమ సంఖ్య | వివరాలు | తేదీలు |
1 | స్లాట్ బుకింగ్ | జులై 7- 8 |
2 | ధ్రువపత్రాల పరిశీలన | జులై 9 |
3 | వెబ్ ఆప్షన్ల చివరి తేదీ | జులై 12 |
4 | తొలి విడత సీట్ల కేటాయింపు | జులై 16 |
5 | సెల్ఫ్ రిపోర్టింగ్ | జులై 16-22 |
6 | రెండో విడత కౌన్సెలింగ్ | జులై 24 |
7 | రెండో విడత వెబ్ ఆప్షన్లు | జులై 24-27 |
8 | రెండో విడత సీట్ల కేటాయింపు | జులై 31 |
9 | మిగిలిన సీట్ల భర్తీ | ఆగస్టు 4 |
10 | తుది విడత వెబ్ ఆప్షన్లు | ఆగస్టు 4- 6 |
11 | తుది విడత సీట్ల కేటాయింపు | ఆగస్టు 9 |
12 | సీట్లు వచ్చిన విద్యార్థులు జాయినింగ్ | ఆగస్టు 9- 11 |
13 | స్పాట్ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలు | ఆగస్టు 10 |
ఇవీ చదవండి :