ETV Bharat / state

'రుణయాప్​లపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలి' - telangana latest news

రుణాలు ఇచ్చే యాప్​లపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలని ఆర్బీఐ అధికారులను.. రాష్ట్ర పోలీసులు కోరారు. రుణయాప్​కు అనుసంధానంగా ఉండే ఖాతాలకు ఆయా బ్యాంకులు కఠినమైన కేవైసీ వ్యవస్థ కలిగి ఉండాలని సూచించారు.

loan apps
loan apps
author img

By

Published : Feb 6, 2021, 5:55 AM IST

రుణయాప్​ల ఆగడాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరహా ఘటనలను నియంత్రించేందుకు ఆర్బీఐ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్​తో పోలీసులు దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు.

loan apps
ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్​తో పోలీసుల దృశ్యమాధ్యమ సమావేశం

ఈ భేటీకి హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు, ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ అధికారులు హాజరయ్యారు. రుణ యాప్​ల దోపిడీలు, వేధింపులపై పోలీసులు వారికి వివరించారు. రుణాలు ఇచ్చే యాప్​లపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలని కోరారు. ప్రజలకు ఆయా నిబంధనలు అర్థం అయ్యేలా ఉండాలని.. ఎన్బీఎఫ్‌సీ నిబంధలను అనుసరించే విధంగా ఉండాలని ఆర్బీఐ అధికారులను.. పోలీసులు కోరారు. రుణ యాప్​కు అనుసంధానంగా ఉండే ఖాతాలకు ఆయా బ్యాంకులు కఠినమైన కేవైసీ వ్యవస్థ కలిగి ఉండాలని సూచించారు.

ఇవీచూడండి: దా'రుణ'యాప్​లను తొలగించండి.. డీజీపీకి హైకోర్టు ఆదేశం

ఆన్​లైన్ లోన్ యాప్​ కేసులో మరో నలుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.