రాష్ట్రంలో చిక్కుకుపోయిన వివిధ ప్రాంతాలకు చెందిన వారు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు పోలీసులు పాసులు ఇవ్వనున్నారు. సొంత రాష్ట్రాలకు వెళ్లే వారు tsp.koopid.ai/epass వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి డిజిటల్ పాసులను జారీ చేస్తామన్నారు.
రోజులో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పాసు జారీ చేస్తామని వెల్లడించారు. కాగా తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు భారీగా దరఖాస్తులు వచ్చాయి పోలీసు శాఖ తెలిపింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏడు వేల పాసులు జారీ చేసినట్లు.. మరో 10 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు చెప్పింది. దరఖాస్తుల వెల్లువతో డిజిటల్ పాసు సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామన్నారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం