ETV Bharat / state

Ministers met CM KCR: తెలంగాణ ఉద్యమ నినాదం పరిపూర్ణమవుతోంది: రాష్ట్ర మంత్రులు - Ministers on Job Notifications

Ministers on Job Notifications: ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ ప్రకటనపై రాష్ట్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. 91 వేల 142 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడంతో మంత్రులు.. కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. నీళ్లు- నిధులు- నియామకాలు నినాదం పరిపూర్ణమైందన్నారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్​లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

job notifications in telangana
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు
author img

By

Published : Mar 9, 2022, 6:41 PM IST

Updated : Mar 9, 2022, 6:49 PM IST

Ministers on Job Notifications: నూతన ఉద్యోగ నియామకాలతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపునకు సాగుతుందని రాష్ట్ర మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే యువత కల సాకారం కానుందని వెల్లడించారు. రాష్ట్రంలో 80 వేల 39 ఖాళీలను భర్తీ చేస్తామన్న సీఎం నిర్ణయంతో.. మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. 11 వేల 103 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న ప్రకటనను స్వాగతించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఛాంబర్​లో కేసీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

సంతోషపడే రోజు: కేటీఆర్​

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇవాళ సంతోషపడే రోజని మంత్రి కేటీఆర్​ అన్నారు. 80వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు రాబోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మహిళా యూనివర్సిటీ, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ 90వేలకు పైగా ఉద్యోగాలు ప్రకటించినందుకు కేసీఆర్​కు ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగాలు ఆశించే విధంగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయిలో... యువత ఆలోచనలు ఘనంగా ఉండాలని మంత్రి కేటీఆర్​ ఆకాంక్షించారు.

ఉద్యమ ట్యాగ్​లైన్​ పరిపూర్ణం: ప్రశాంత్​ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నీళ్లు-నిధులు-నియామకాలు నినాదంతో.. సబ్బండ వర్గాలను ఉద్యమ నేత కేసీఆర్ ఏకం చేయగా... ఆ నినాదం పరిపూర్ణమైందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సాగు నీటి ప్రాజెక్టులతో తెలంగాణ బీడు భూములను పచ్చని పైరులతో కళకళలాడుతున్నాయని కొనియాడారు. ఆర్థిక క్రమశిక్షణతో నేడు తెలంగాణ జీఎస్డీపీ వృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదిగిందని తెలిపారు. ఇక నియామకాల విషయంలోనూ ఉద్యమ ట్యాగ్ లైన్ స్పూర్తిని కొనసాగిస్తున్నారని ఉద్ఘాటించారు. 11 వేల 103 మంది ఒప్పంద ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించడం, 80 వేల 39 ఉద్యోగాల భర్తీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడం పట్ల మంత్రి ప్రశాంత్​ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రతిపక్షాలు ఇప్పుడు ఏం మాట్లాడతారు.?

95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కే విధంగా జోనల్ విధానానికి రూపకల్పన చేసి.. ఖాళీల భర్తీ కోసం ఆదేశాలివ్వడం పట్ల మంత్రి ప్రశాంత్​ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కోడిగుడ్డుపై ఈకలు పీకే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు ఈ అంశంపై మాట్లాడాలని సవాల్​ విసిరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3,316 ఉద్యోగాలతోపాటు జోన్, మల్టీ జోన్ పోస్టుల భర్తీకి మార్గనిర్దేశం చేసిన సీఎంకు జిల్లా ప్రజలు, యువత తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.

భాజపాకు చిత్తశుద్ధి ఉందా.?: శ్రీనివాస్ గౌడ్​

ఇప్పటికే లక్షా 33 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. ఇప్పుడు మరో 91 వేల ఉద్యోగాల ప్రకటన చేసిన సీఎం కేసీఆర్​కు మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ధన్యవాదాలు తెలియజేశారు. యువతకు మంచి చేయాలని కేసీఆర్​కు ఉందని.. ఇక నుంచి ప్రతీ ఏడాది నియమకాలుంటాయని సీఎం చెప్పారని వెల్లడించారు. దేశాన్ని బాగు చేయాలంటే కేసీఆర్ వల్లనే అవుతుందని స్పష్టం చేశారు. ఏడేళ్లుగా కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని వెల్లడించారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారని.. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలని చెప్పారు.

అభ్యర్థులకు ఆల్ ​ది బెస్ట్​: ఎర్రబెల్లి

గత ఏడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని లక్షా 34 వేలు ఖాళీలను నేరుగా భర్తీ చేయడం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తెలిపారు. అసెంబ్లీలో కేసీఆర్​ ప్రకటన రాష్ట్ర చరిత్రలో చరిత్రాత్మకంగా కలకాలం నిలిచిపోతుందన్న ఎర్రబెల్లి.... వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. టీఎస్​పీఎస్​సీ, ఇతర ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా నిర్వహించే నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని వివరించారు. నిరుద్యోగులు,విద్యావంతులు, విద్యార్థులు కష్టపడి చదివి పోటీ పరీక్షలకు హాజరై ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

సద్వినియోగం చేసుకోవాలి: ఇంద్రకరణ్​

ఉద్యోగ నియామకాలపై శుభవార్త ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖా నాయక్‌, రాథోడ్ బాపురావులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. కరోనా లాంటి క‌ష్టకాలంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులకు సీఎం ప్రకటన కొత్త ఆశలు చిగురింపజేసింద‌ని హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భ‌ర్తీతో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని.. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతీ సంవత్సరం ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ప్రకటించి, పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించ‌డం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిద‌ర్శనమని స్పష్టం చేశారు.

బీసీలకు నేరుగా లబ్ధి: గంగుల

నిరుద్యోగులకు ప్రభుత్వం చెప్పిన తీపికబురు బీసీలకు వరప్రదాయినిగా మారబోతుందని బీసీ సాంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసే 80,039 ఉద్యోగాల్లో బీసీల వాటాగా అత్యధికంగా 23 వేలు పైగా బీసీ అభ్యర్థులు నేరుగా లబ్ధి పొందబోతున్నారని తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌తో ఆయన కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రణాళికతో చదవాలి: సత్యవతి

తెలంగాణ చరిత్రలో నిరుద్యోగులు కలకాలం గుర్తుంచుకునే ప్రత్యేక రోజు... 2022 ఉద్యోగ నామ సంవత్సరం అని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు స్థానికులకే దక్కే విధంగా జోనల్​ విధానం రూపొందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజన ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని 20 ఏళ్ల కింద తీసుకొచ్చిన జీవో 3 కొట్టేయడం వల్ల ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు నష్టం జరుగుతుందని శాసనసభలో ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లామనిన మంత్రి అన్నారు. స్పందించిన ముఖ్యమంత్రి... గతంలో అవలంభించిన విధానాల్లో నియామకాలు చేపట్టేలా సమీక్ష జరిపి గిరిజనులకు స్థానికంగా ఉద్యోగాలు వచ్చేటట్లు న్యాయం చేయాలని ఆదేశించారని తెలిపారు. అభ్యర్థులు పక్కా ప్రణాళికతో చదివి ఉద్యోగులుగా నియామకాలు పొందాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆకాంక్షించారు.

కలలు నిజమయ్యాయి: నిరంజన్​ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజల భాగస్వామ్యం, అమరుల త్యాగాల మూలంగా సాధించుకున్న తెలంగాణ ప్రజల కలలు నిజమయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఉద్యోగ నియామకాల ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, పట్నం నరేందర్ రెడ్డితో కలిసి కేసీఆర్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగులకు జరిగిన అన్యాయం, అసమానతలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సరిచేశామని చెప్పుకొచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే కలలు కేసీఆర్ నిజం చేస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'తెలంగాణలో 91వేల ఉద్యోగాల భర్తీ.. ఏపీలో ఉద్యోగుల జీతాలకే దిక్కులేదు'

Last Updated : Mar 9, 2022, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.