ktr to meet piyush goyal: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలను మంత్రులు కొనసాగిస్తున్నారు. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్‌తో సమావేశమయ్యారు. ధాన్యం సేకరణపై చర్చించారు. కొన్ని విజ్ఞప్తులపై కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఏడాది మొత్తం మీద రెండు సీజన్లలో 100 నుంచి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రుల బృందం కోరింది. అలా కాకుండా... ఏ సీజన్‌లో ఎంత ఉత్పత్తి ఉంటుందో చెప్పాలని కేంద్రమంత్రులు అడిగారు. కేంద్ర మంత్రులు కొన్ని విషయాలపైనే సానుకూలంగా స్పందించారని...కొన్నింటిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదని తెలిసింది.
రెండు సీజన్లలో ఎప్పుడు ఎంత ఉత్పత్తి అవుతుందో.. ఒక నిర్దిష్ట అంచనాతో వస్తే.. ఒక నిర్ణయానికి రావొచ్చని పీయూష్ గోయల్ అన్నట్లు సమాచారం. ఈనెల 26న మరోసారి కూర్చొని.... అన్ని విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుందామని పీయూష్ గోయల్ చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న ఎంపీలు తెలిపారు. కేంద్రమంత్రులతో సమావేశ వివరాలను మంత్రులు... సీఎం కేసీఆర్‌కు వివరించారు.
ఇదీ చూడండి: 'దిల్లీలో కేసీఆర్ యుద్ధం చేసి వచ్చేసరికి.. వడ్లన్నీ మొలకెత్తేలా ఉన్నాయ్'