ETV Bharat / state

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీల భేటీ

author img

By

Published : Mar 24, 2022, 3:04 PM IST

Updated : Mar 24, 2022, 4:56 PM IST

14:55 March 24

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీల భేటీ

TRS ministers Meet Piyush goyal: కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో గోయల్‌ను కలిసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్​, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్​కుమార్​, తెరాస ఎంపీలు కలిశారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్​గోయల్​ను కోరారు.

దిల్లీ కేంద్రంగా వరిపోరును అధికార తెరాస మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే హస్తిన చేరుకున్న మంత్రులు కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యచరణను ముమ్మరం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెరాస ఎంపీలు.. బుధవారం ఉదయం రాజ్యసభ లాబీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. ధాన్యం సేకరణపై కేంద్రమంత్రితో ప్రస్తావించిన ఎంపీలు నలుగురు తెలంగాణ మంత్రులు దిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని పీయూష్‌ని ఎంపీ కె.కేశవరావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అపాయిమెంట్ ఇవ్వగా.. ఆయనను ఇవాళ మంత్రులు, ఎంపీలు కలిశారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్.. మంగళవారం దిల్లీ వెళ్లారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, సంబంధిత అధికారులను కలుస్తామని మంత్రులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొని వస్తామని మంత్రులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాకపోతే ఏం చేయాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​తో రాష్ట్రమంత్రులు, ఎంపీల భేటీపై ప్రాధాన్యత నెలకొంది.

ఇదీ చదవండి:

Last Updated : Mar 24, 2022, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.