ETV Bharat / state

'సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ' - Minister talasani in sanath nagar

బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్​ సనత్​నగర్​ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

telangana minister talasani srinivas yadav
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
author img

By

Published : Oct 10, 2020, 2:15 PM IST

సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ పెట్టింది పేరని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో ఎంతో గుర్తింపు పొందిందని తెలిపారు. పూలను పూజించే బతుకమ్మ పండుగను రాష్ట్ర మహిళలంతా సంతోషంగా జరుపుకోవాలని కోరారు.

హైదరాబాద్ సనత్​నగర్​ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్​పేట, వివేకానందనగర్​ కమిటీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ సర్కార్​ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు హేమలత, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.