హైదరాబాద్ వెస్ట్మారేడ్పల్లిలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. 2.50 లక్షల రూపాయల చెక్కును విద్యావతి అనే మహిళకు అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికసాయం పొంది అనేక మంది మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని మంత్రి అన్నారు. తనకు ఆర్థిక సాయం మంజూరు చేయించేందుకు కృషి చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు విద్యావతి కృతజ్ఞతలు తెలిపారు.