KTR at Ambedkar University : అన్ని రంగాల్లోనూ తెలంగాణ సమతుల్య అభివృద్ధిని సాధిస్తోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఐదు రకాల విప్లవాలతో రాష్ట్ర గ్రామీణ వ్యవస్థ పరిపుష్ఠమైందని తెలిపారు. తలసారి ఆదాయం, జీఎస్‌డీపీలో గణనీయమైన పెరుగుదల నమోదైందని వెల్లడించారు. రాజకీయాల్లో ప్రవేశానికి మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందన్న కేటీఆర్ సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని ప్రజలు భరించరని వ్యాఖ్యానించారు.
KTR Latest News : హైదరాబాద్ అంబేడ్కర్ వర్సిటీలో 'మీడియా ఇన్ తెలంగాణ-పాస్ట్, ప్రసెంట్, ఫ్యూచర్' అంశంపై జరిగిన చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఎనిమిదేళ్ల కిందట తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నో అనుమానాలు ఉన్నాయని వాటన్నింటిని పటాపంచలు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు విధిస్తే.. ఇప్పుడు వ్యవసాయానికి సహా అన్ని రంగాలకు నిరాంతరాయ విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.
Hyderabad News Today : కాళేశ్వరం, మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులతో దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని కేటీఆర్ అన్నారు. పాలనలో లోపాలను మాత్రమే కాకుండా అభివృద్ధిని కూడా చూడాలని సూచించారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ప్రవేశానికి మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని ప్రజలు భరించరని తెలిపారు. తన పనితీరు వల్లే సిరిసిల్లలో మెజార్టీ పెరిగిందన్న కేటీఆర్.. సరిగ్గా పనిచేయకపోతే ప్రజలు తనను పక్కన పెట్టేవారన్నారు.