ETV Bharat / state

నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి ముందు ఒప్పంద కార్మికుల ధర్నా - నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వార్తలు

హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 10 శాతం ఇన్సెంటివ్స్, రూ.300 రిస్క్​ అలవెన్లు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి... పూర్తి స్థాయిలో విధులకు దూరమవుతామని హెచ్చరించారు.

nallakunata fever hospital
nallakunata fever hospital
author img

By

Published : Aug 9, 2020, 1:17 PM IST

ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తోన్న ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న 10శాతం ఇన్సెంటివ్స్​, రూ.300 రిస్క్​ అలవెన్స్ హామీలు వెంటనే నెరవేర్చాలని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరు నెలలుగా కార్మికులు, ఔట్​సోర్సిగ్ వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం సేవలందిస్తే ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదని వాపోయారు.

తమకు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదని యూనియన్ అధ్యక్షుడు ఎల్.నరసింహ తెలిపారు. తమ సమస్యలను మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా... ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి... పూర్తి స్థాయిలో విధులకు దూరమవుతామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.