Telangana Main Politicians in MLA Contest : ఎన్నికల పర్వంలో అగ్రనేతలు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పోటాపోటీగా అనేక హామీలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఈసారి ఎన్నికల్లో అతిరథ మహారథులు, ముఖ్య నేతలు, తొలిసారి రాజకీయ అరంగేట్రం చేస్తున్నవారు తమ రాజకీయ జీవితాన్ని పరీక్షించుకుంటున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు సాగుతోంది.
తెలంగాణలో తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారాలు - గెలుపు కోసం చెమటోడ్చుతోన్న అభ్యర్థులు
రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులు ఒకే నియోజవర్గంలో పోటీ చేయడంతో ప్రజల దృష్టి ఈసారి అటువైపు మళ్లింది. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, 118 స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో ఒక చోట సీపీఐ, 11 స్థానాల్లో బీజేపీ, పొత్తులో భాగంగా 8 నియోజకవర్గాల్లో జనసేన, 19 నియోజకవర్గాల్లో సీపీఎం, 107 స్థానాల్లో బీఎస్పీ పోటీలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడుగురు ఎంపీలు, 104 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 5మంది ఎమ్మెల్సీలు సహా 2,290 మంది తమ అదృష్ట పరీక్షను ఎదుర్కొంటున్నారు.
'ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును వినియోగించుకోవాలి'
Telangana MLC's And MP's As MLA Contest : రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి (కొడంగల్, కామారెడ్డి), ఉత్తమ్ (హుజూర్నగర్), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (నల్గొండ), బీజేపీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ (కరీంనగర్), సోయం బాపురావు (బోథ్). అర్వింద్ (కోరుట్ల), బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక) నుంచి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి (హుజూరాబాద్), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్) నుంచి ఎన్నికల్లో నిల్చున్నారు. కాంగ్రెస్ నుంచి టి. జీవన్‌రెడ్డి (జగిత్యాల), కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి) పోటీ చేస్తున్నారు. మొత్తానికి 30 స్థానాల్లో కీలక నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు.
తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న స్టార్ క్యాంపెయినర్లు - అభ్యర్థులకు ఎంతవరకు కలిసొచ్చేనో?
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 స్థానాల్లో కీలక నేతలు రంగంలో ఉండడంతో సర్వత్రా దీనిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్లో మరోమారు పోటీ చేస్తుండగా అదే స్థానంలో బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్ తలపడుతున్నాురు. కేసీఆర్ బరిలో నిలిచిన మరో స్థానంలో కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండగా.. ఇక్కడే బీజేపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది.
దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకుందాం : సోనియా గాంధీ
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాలుగోసారి సిరిసిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన భారీ అధిక్యంతో గెలిచారు. ఈసారి కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా బలం నిరూపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. సిద్దిపేట బీఆర్ఎస్ కీలకనేత.. మంత్రి హరీశ్‌రావు మరోసారి బరిలో దిగారు. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండగా.. బండి సంజయ్ బీజేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
విధుల్లో పక్షపాతం వహించారని- ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు