ETV Bharat / state

Telangana Liquor Shops Notification 2023 : తెలంగాణలో మూణ్నెళ్ల ముందే మద్యం టెండర్లు - తెలంగాణ తాజా వార్తలు

Notification for Telangana Liquor Shops Application Process : మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల ఎంపికకు శుక్రవారం నుంచి అబ్కారీ శాఖ దరఖాస్తులను స్వీకరించనుంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాలుగు నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్‌దారుల ఎంపిక ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్న అబ్కారీ శాఖ 21న జిల్లా కలెక్టర్‌ల సమక్షంలో డ్రా ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించింది. 2వేల 620 దుకాణాలల్లో 786 షాపులు గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించనున్నట్లు ఉత్తర్వులో తెలిపింది.

liquor
liquor
author img

By

Published : Aug 3, 2023, 6:57 AM IST

తెలంగాణ లిక్కర్​ షాపుల లైసెన్స్​దారుల ఎంపిక ప్రక్రియ

Telangana Liquor Shops Tenders Notification 2023 : రాష్ట్రంలో 2021 డిసెంబర్‌ నుంచి అమలులోకి వచ్చిన మద్యం దుకాణాల లైసెన్స్‌లకు ఈ ఏడాది నవంబరు 30వరకు గడువు ఉంది. ఇంకో నాలుగు నెలలుపాటు గడువు ఉన్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల నిబంధనలు అడ్డు వస్తాయని... ప్రభుత్వం ముందుగానే జీవో జారీ చేసింది. పాత విధానం ద్వారానే దుకాణాల లైసెన్సీల ఎంపిక జరగనుంది. నాన్‌ రిఫండ్‌బుల్‌ దరఖాస్తు రుసుం, లైసెన్స్‌ ఫీజులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 2వేల 620 మద్యం దుకాణాలకు లైసెన్సీల ఎంపిక ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది. ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్‌ ప్రకారం గౌడ్లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం లెక్కన 786 దుకాణాలు కేటాయించారు. మిగిలిన 1834 దుకాణాలు ఓపెన్‌ క్యాటగిరి కింద కేటాయిస్తామని తెలిపింది.

Telangana Liquor Shops Notification 2023 : ఎక్కడెక్కడ రిజర్వేషన్ల కింద లైసెన్సీలను ఎంపిక చేయాలో కలెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా అబ్కారీ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. రేపు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలై 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నెల 21న కలెక్టర్ల పర్యవేక్షణలో డ్రా ద్వారా లైసెన్సీలను ఎంపిక చేయనున్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి విక్రయాలు ప్రారంభించాల్సి ఉంటుంది.

Telangana Liquor Shops Application Process : కొత్తగా పొందే లైసెన్సీలు రెండేళ్ల పాటు అంటే 2025 నవంబరు వరకు చెల్లుబాటుకానున్నాయి. గతంలో మాదిరిగానే లైసెన్స్‌ రుసుంను ఆరుశ్లాబులుగా ఖరారుచేసింది. నాన్‌రిఫండబుల్‌ దరఖాస్తు రుసుంను 2లక్షలుగా నిర్ణయించింది. ఒకరు ఎన్నైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ రుసుముకు రూ.2లక్షల చొప్పున చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. 5వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ రుసుముకు ఫీజు రూ.50 లక్షలు, 5వేలు నుంచి 50 వేలు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.60 లక్షలుగా నిర్ణయించింది. లక్ష నుంచి 5లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉంటే 85 లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో కోటి పది లక్షలు లైసెన్స్‌ ఫీజును ఖరారుచేశారు.

ఈ సంవత్సరం రూ.1500 కోట్లు అంచనా: 2019లో దరఖాస్తుల ద్వారా రూ.975 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అదే విధంగా 2021లో 67వేల 849 దరఖాస్తులు రావడంతో తద్వారా రూ.1357 కోట్ల మేర రాబడి సమకూరింది.అయితే ఈ ఏడాది మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం మరింత మంది పోటీ పడే అవకాశం ఉందని రూ.1500 కోట్లకు పైగా రాబడి రావచ్చని ఆబ్కారీశాఖ అంచనా వేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.