Telangana Liberation Day 2023 Celebrations : హైదరాబాద్ సంస్థానం భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్ 17ను.. తెలంగాణ విమోచనం (Telangana Liberation Day) పేరిట కేంద్ర ప్రభుత్వం వేడుకల్ని నిర్వహిస్తోంది. గత ఏడాది మాదిరిగానే సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ వేదికగా ఉత్సవాలు జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah Participate in Telangana Liberation Day Celebrations) తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న రాత్రే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు.
Kishan Reddy on Telangana Liberation Day 2023 : 'తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాల్సిందే'
Amit Shah Visit to Hyderabad : సీఆర్పీఎఫ్ ఆఫీసర్స్ స్టాఫ్‌మెస్‌లో బస చేసిన అమిత్ షా.. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, సీడబ్ల్యూసీ సమావేశాలు, పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై ఆరా తీసినట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పడక్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని అమిత్ షా ((Amit Shah) దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీలను పటిష్ఠం చేయడమే కాకుండా.. వారికి అప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా పూర్తి చేసేలా చూడాలని సూచించారు.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా : ఎన్నికల హామీ నెరవేర్చడంలో బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని అమిత్ షా స్పష్టంచేశారు. ఈనెల 28 నుంచి అక్టోబరు 2 వరకు రాష్ట్రంలో మూడు వైపుల నుంచి చేపట్టే బస్సు యాత్ర, హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరలో కొలిక్కి తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ బలోపేతమే లక్ష్యంగా మూడు నెలల పాటు శ్రమించాలని అమిత్ షా రాష్ట్ర నేతలను ఆదేశించారు.
Amit Shah Khammam Meeting : ఖమ్మంలో 'రైతు గోస- బీజేపీ భరోసా' సభతో.. రాష్ట్రంలో వేడేక్కిన రాజకీయం
Amit Shah Will Participate in Telangana Liberation Day Celebrations : అమిత్ షా వేడుకల్లో పాల్గొంటున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ను కేంద్ర బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. పరేడ్‌గ్రౌండ్‌కు రానున్న అమిత్ షా తొలుత పోలీస్ అమరవీరుల స్మృతి స్థల్ వద్ధ నివాళి అర్పిస్తారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి.. పారామిలటరీ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. తెలంగాణ విమోచన వేడుకల్లో భాగంగా కళారూపాలను ప్రదర్శించనున్నారు. బతుకమ్మ, బోనాలు, పోతురాజులు, ఒగ్గుడోలు విన్యాసాలు, కోలాటం, తప్పెట, థింసా, లంబాడ నృత్యాలను ప్రదర్శించనున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర కళారూపాలనూ ప్రదర్శిస్తారు. కళాకారులు మూడు రోజులుగా పరేడ్‌గ్రౌండ్‌లో సాధన చేస్తున్నారు.
జెండా ఆవిష్కరణ తర్వాత స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను అమిత్ షా సన్మానించనున్నారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఎన్నికల వేళ జరుగుతున్న వేడుకల్లో ఆయన ప్రసంగంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. వేడుకల అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా.. అక్కడి నుంచి దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
Amit Shah Speech on TS Liberation : 'విమోచన వేడుకలు జరపడానికి ఎవరూ సాహసించలేదు'